వీటిని గుర్తుపట్టారా..? వరుసగా 8 వారాలు రోజూ తింటే ఒంట్లో కొవ్వు హుఫ్!
09 February 2026
TV9 Telugu
TV9 Telugu
ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి మేలు చేసే తృణ ధాన్యాలల్లో ఓట్స్ ముందు వరుసలో నిలిచాయి. వీటిల్లో ఉండే పోషకాలే అందుకు కారణం
TV9 Telugu
ఇందులో బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ తో పాటు అవెనాంత్రామైడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.
TV9 Telugu
ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, బరువును తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి
TV9 Telugu
ఓట్స్ ను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ ను బంధిస్తుంది. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి
TV9 Telugu
వీటిని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ దాదాపు 5 నుండి 10 శాతం వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ రక్తంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాయి
TV9 Telugu
దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి
TV9 Telugu
అలాగే ఓట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ ధమనుల ఆరోగ్యానికి మద్దతును ఇస్తుంది. దీంతో సిస్టోలిక్ బిపి అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఓట్స్ ను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల సిస్టోలిక్ బీపీ 2 నుండి 3 ఎమ్ఎమ్ హెచ్‌జి వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది