AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pithapuram: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం.. ప్రతి పాఠశాలలో ఆ సదుపాయం

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పిఠాపురం అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పారు.

Pithapuram: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం.. ప్రతి పాఠశాలలో ఆ సదుపాయం
Pawan Kalyan With Students
Ram Naramaneni
|

Updated on: Nov 04, 2024 | 7:09 PM

Share

పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్య, క్రీడలు, శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలులోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్కూల్లో విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ని ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్ధులతో ముఖా ముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పిఠాపురం నియోజక వర్గానికి శాసన సభ్యుడిగా కాకుండా మీలో ఒకడిగా ఒక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే చాలు అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. నేను చదువుకునే రోజుల్లో నాయకులు ఎలా ఉండాలి అని ఊహించుకున్నానో.. అలా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్ధులు ఎంత బాగా చదువుకుంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగడానికి నీరు, ఆట స్థలాలు బాగుంటే ఆహ్లాదకర వాతావరణంతో విద్యార్ధులు బాగా చదువుకుంటారు. విద్యార్ధులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. మనసు ఎంత బలంగా ఉంటుందో శరీరం కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణంగా విద్యాభ్యాసం సాధ్యపడుతుంది. విజువల్ థింకింగ్ మీద దృష్టి సారించాలి. డ్రాయింగ్ స్కిల్స్ బాగుంటే చదివిన చదువు కూడా ఎక్కువగా గుర్తు ఉంటుంది. ఉపాధ్యాయులు మైండ్ మ్యాపింగ్ మీద దృష్టి సారించాలి. అవసరం అయితే మైండ్ మ్యాపింగ్ మీద వర్క్ షాపు నిర్వహించాలి” అన్నారు.

 కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు హామీ

విద్యార్ధులతో ముఖాముఖీ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ తరగతి గదిలోని ప్రతి విద్యార్ధి పేరు అడిగి తెలుసుకుని కరచాలనం చేశారు. పాఠశాలకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా అని పవన్ కళ్యాణ్  అడుగగా.. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయమని విద్యార్ధులు కోరారు. తక్షణం స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలిని పిలిచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఎన్ని కంప్యూటర్లు కావాలని ఆరా తీశారు. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..