Watch: ఏటీఎం చోరీకి వచ్చి అడ్డంగా బుక్కైన దొంగ.. అతను ఎవరో తెలిసి ఆ అంతా షాక్…
అర్థరాత్రి ఏటీఎం సెంటర్లోకి చొరబడిన ఓ వ్యక్తి.. ఏటీఎం మిషన్‌పు పగలగొట్టి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సుమారు 20 నిమిషాల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకున్నాడు దొంగ. అయితే ఈ తతంగాన్నంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ద్వారా గమనించిన బ్యాంక్ సిబ్బంది పోలీసలకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాకినాడ జిల్లా తునిలో అర్థరాత్రి వింత ఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఏటీఎంలో చోరి చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ దొంగ. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని రామాథియేటర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ చేసేందుకు ఓ దొంగ అర్ధరాత్రి 12 గంటల తరువాత అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడం గమనించిన ఏటీఎం వద్దకు వెళ్లి ఓ బండరాయితో మిషన్‌ను పగలకొట్టేందుకు ప్రయత్నించాడు. సుమారు 20 నిమిషాల పాటు కష్టపడినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు.
అయితే అతను మిషన్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు అన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో.. గమనించిన ఎస్బిఐ బ్యాంక్ సిబ్బంది స్థానిక బ్రాంచ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పట్టుబడిన వ్యక్తి ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల రంజిత్‌కుమార్‌గా గుర్తించారు పోలీసులు.
ఇతను గతంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేశాడని.. ఉద్యోగం రెగ్యులరైజ్ కాకపోవడంతో దాన్ని వదిలేసి ఇలా తిరుగున్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నాడు. గత రెండేళ్లుగా రంజిత్ మానసికస్థితి సరిగ్గా లేదని.. హైదరాబాద్ నుంచి తమ సొంతూరుకు ట్రైన్‌లో టికెట్ లేకుండా ప్రయాణించడంతో రైల్వే అధికారులు గుర్తించి తునిలో అతన్ని దించేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అప్పటి నుంచి నగరంలోనే తిరుగుతూ డబ్బుల కోసం ఇలా ఏటీఎం చోరికి యత్నించినట్టు గుర్తించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
