AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ ..

వాతావరణ శాఖ ఈ రోజు(మంగళవారం) ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడినట్లు గుర్తించారు. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా..

AP Rains: తీర ప్రాంతాలకు అలెర్ట్.. ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్ ..
Ap Weather Report
Follow us

|

Updated on: Dec 06, 2022 | 3:04 PM

వాతావరణ శాఖ ఈ రోజు(మంగళవారం) ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడినట్లు గుర్తించారు. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆపై క్రమక్రమంగా బలపడి రేపు(డిసెంబర్ 7) సాయంత్రం నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణాంధ్ర తీరానికి చేరుకుంటుంది.

అనంతరం ఎల్లుండి(డిసెంబర్ 8) ఉదయనికి ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు..

ఉత్తరాంధ్ర, యానాం

ఇవి కూడా చదవండి

ఈ రోజు,  రేపు :-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది

దక్షిణాంధ్ర

ఈ రోజు, రేపు :-

ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే పడవచ్చు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40 -50 కి మీ గరిష్టము గా 60 కి మీ వేగం తో)వీయవచ్చు.

రాయలసీమ

ఈ రోజు, రేపు :-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..