AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. నైరుతి రుతుపవనాలు తిరోగమనం.. వారం ఆలస్యంగా.. వర్షాలకు ఛాన్స్..

నైరుతి రుతుపవనాలు తిరోగమన ప్రక్రియ మొదలైనట్లే..! ఎందుకంటే అందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దేశంలోనే వాయువ్య ప్రాంతంలో యాంటీ సైక్లోన్ పరిస్థితులు ఉండడం, రాజస్థాన్లో పొడి వాతావరణం.. రుతుపవనాల తిరోగమనానికి సూచిస్తున్నాయి. పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి తిరోగమన మొదలవుతుంది.

Rains Alert: బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం.. నైరుతి రుతుపవనాలు తిరోగమనం.. వారం ఆలస్యంగా.. వర్షాలకు ఛాన్స్..
ఉరుములు మెరుపులతో కుంభవృష్టి పడింది. కొద్దిరోజులుగా ఎండకాలం మాదిరిగా ఎండలతో అల్లాడిన జనం వర్షంతో చల్లబడ్డారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Sep 25, 2023 | 11:13 AM

మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పావా.. అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. ఈనెల 29నాటికి అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. ఆ తరువాత 24 గంటల్లోనే బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ. దీనికి తోడు ప్రస్తుతం.. ఒడిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణ కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు కోస్తాలో రాయలసీమలో తేలిక పాటి వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండి ప్రకటించింది. రాయలసీమ లోను చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐ ఎం డీ సూచిస్తోంది.

 నైరుతి రుతుపవనాలు తిరోగమనం..

నైరుతి రుతుపవనాలు తిరోగమన ప్రక్రియ మొదలైనట్లే..! ఎందుకంటే అందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దేశంలోనే వాయువ్య ప్రాంతంలో యాంటీ సైక్లోన్ పరిస్థితులు ఉండడం, రాజస్థాన్లో పొడి వాతావరణం.. రుతుపవనాల తిరోగమనానికి సూచిస్తున్నాయి. పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి తిరోగమన మొదలవుతుంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై.. అక్టోబర్ 15వ తేదీ కల్లా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని ఐఎండి అంచనా వేస్తుంది.

వారం ఆలస్యంగా.. వర్షాలకు ఛాన్స్..

నైరుతి రుతుపవనంలో తిరోగమన ప్రక్రియ.. వారం పాటు ఆలస్యంగా ప్రారంభమైనట్టు ఐఎండి అంచనా వేసింది. వాస్తవానికి సెప్టెంబర్ 17 నాటికి రాజస్థాన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రుతుపవంలో ప్రవేశం కూడా ఈ ఏడాది ఆలస్యంగానే జరిగింది. వర్షాలు కూడా అంత ఆశించినంత స్థాయిలో ఏపీలో నమోదు కాలేదు. తుఫాన్లు వాయుగుండాలు కూడా బంగాళాఖాతంలో ఏర్పడలేదు. ఇక నైరుతి రుతుపవనాలు తిరోగమనం లో వర్షాలు కురిసే ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తిరోగమనలో వర్షాలు పుష్కలంగా పడితే ఇప్పటి వరకు ఏపీ లో ఉన్న లోటు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..