Ganesh Chaturthi: బొజ్జగణపతికి 108 నైవేద్యాలు.. అల్లుడైనా, ఆరాధించే దైవమైనా గోదారోళ్ల రుచులు వెరీ వెరీ స్పెషల్..
కొవ్వూరులో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మేరక వీధి వాటర్ ట్యాంక్ వద్ద ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు భక్తులు వినాయకుడికి భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారి ముందు ఉంచారు. మా గణపయ్య ఉండ్రాళ్లు ఒకటే కాదు ఎన్నో రకరకాల స్వీట్లను, పిండి వంటలను ఆరగిస్తాడు అనే విధంగా భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు.
బొజ్జగణపయ్య నీ బంటు మేమయ్య అంటూ ఊరు వాడ వినాయకచవితి నుంచి పెద్ద ఎత్తున పూజలు జరుపుతున్నారు భక్తులు. అయితే గణాధ్యక్షనిగా బాధ్యతలు తీసుకునే సందర్బంలో ఆయన ప్రీతిపాత్రంగా భుజించడం, పార్వతీ పరమేశ్వరులకు మోకరిల్లి నమస్కరించ లేక ఆయాసపడటం, చంద్రుని పరిహాసం అందరికీ తెలిసిన కథే. అయితే వినాయక ప్రీతిని తెలిసిన భక్తులు చాలా విధములుగా ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి భారీ లడ్డూలను సమర్పిస్తే మరికొందరు నగదునే మాలలుగా సమర్పిస్తున్నారు. ఇక కొవ్వూరు లో 108రకాల పదార్థాలతో లంబోదరునికి నైవేద్యం పెట్టడం విశేషంగా మారింది. గోదారోళ్లు ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. అల్లుడైనా ఆరాధించే దైవమైనా అతిధి మర్యాదలు తగ్గకూడదంటున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వాడవాడలా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్య నవరాత్రుల పూజలు మండపాల వద్ద శోభాయమానంగా ప్రజ్వరిల్లుతున్నాయి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే అమితమైన ఇష్టం. వాటినే ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. కానీ అక్కడ మాత్రం ఉండ్రాళ్లతోపాటు బోలెడన్ని రకరకాల వంటకాలతో భారీ నైవేద్యాన్ని సమర్పించారు. ఆ భారీ నైవేద్యాన్ని చూసేందుకు అక్కడ స్థానికుల సైతం పోటీలు పడ్డారు.
కొవ్వూరులో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మేరక వీధి వాటర్ ట్యాంక్ వద్ద ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు భక్తులు వినాయకుడికి భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామి వారి ముందు ఉంచారు. మా గణపయ్య ఉండ్రాళ్లు ఒకటే కాదు ఎన్నో రకరకాల స్వీట్లను, పిండి వంటలను ఆరగిస్తాడు అనే విధంగా భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు.
ఆ నైవేద్యంలో లడ్డూలు, కాజాలు జాంగ్రీలు మైసూర్ పాకులు, పాలకోవా, కలకంద లాంటి నోరూరించే స్వీట్లే కాకుండా గారెలు, బూరెలు వండి ఆ బొజ్జ గణపయ్యకు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అయితే 108 రకాల తో భారీ నైవేద్యం ఏర్పాటు చేయడంతో వాటిని చూసేందుకు స్థానికులు పోటీలు పడ్డారు. గణపతి పూజ అయిన అనంతరం వచ్చిన భక్తులందరికీ 108 రకాల ఇంటి వంటలు కలిసిన భారీ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచారు.
గత ఏడు సంవత్సరాలుగా మెరక వీధి వాటర్ ట్యాంక్ వద్ద వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ సంవత్సరం ఏడవ సంవత్సరం కావడంతో ఏడవ రోజు స్వామి వారికి అత్యంత భారీ నైవేద్యాన్ని సమర్పించాలనే ఆలోచనతోనే 108 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..