AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహత్యమా – నిర్మాణ నైపుణ్యమా.. అక్కడ ఏడాదికి మూడు రోజులే శివలింగం పై సూర్యరశ్మి పడుతుంది..

sun rays fall on 'Siva Lingam': నిజంగా మాటలకే అంతుచిక్కని విచిత్రం ఈ సూర్యకిరణాలు..చుట్టూ నాలుగు వైపులా గుట్టలు.. పడమటి ముఖద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడి లోని శివలింగంపై వాలుతున్న సూర్య కిరణాలు ఆ స్వయంభు శివలింగానికి పునశక్తిని ప్రసాదిస్తున్నాయి..అది కూడా కేవలం ఏడాదిలో మూడురోజులు మాత్రమే సూర్యకిరణాలు శివున్ని స్పర్శించి భక్తులను పులకరించి పోయేలా చేస్తున్నాయి..

మహత్యమా - నిర్మాణ నైపుణ్యమా.. అక్కడ ఏడాదికి మూడు రోజులే శివలింగం పై సూర్యరశ్మి పడుతుంది..
Sun Rays Fall On 'siva Ling
G Peddeesh Kumar
| Edited By: Sanjay Kasula|

Updated on: Sep 25, 2023 | 2:01 PM

Share

హనుమకొండ, సెప్టెంబర్ 25:  అది మాయో, మహత్యమో..! లేక ఆలయ నిర్మాణంలో నైపణ్యమో ఏమో కానీ.. సూర్యకిరణాలు ఆశ్చర్య పరుస్తున్నాయి.. ఓ వింత ఆక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే సూర్యకిరణాలు పరమశివుడి మహాత్యంగా బావిస్తున్నారు భక్తులు… ఆ కిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే ఎలా శివలింగంపై పడుతున్నాయి..! మూడు ప్రధాన ద్వారాలు దాటి లింగంపై సూర్య కిరణాలు పడడం ఎలా సాధ్యం… మిస్టరీగా మారిన ఆ సన్ మిరాకిల్ ను మీరే చూడండి..

నిజంగా మాటలకే అంతుచిక్కని విచిత్రం ఈ సూర్యకిరణాలు..చుట్టూ నాలుగు వైపులా గుట్టలు.. పడమటి ముఖద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడి లోని శివలింగంపై వాలుతున్న సూర్య కిరణాలు ఆ స్వయంభు శివలింగానికి పునశక్తిని ప్రసాదిస్తున్నాయి..అది కూడా కేవలం ఏడాదిలో మూడురోజులు మాత్రమే సూర్యకిరణాలు శివున్ని స్పర్శించి భక్తులను పులకరించి పోయేలా చేస్తున్నాయి..

1100 సంవత్సరాల క్రితం హనుమకొండలో వెలసిన స్వయంభూ సిద్దేశ్వరాలయంలో ఈ విచిత్రం భక్తులను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.. ఈ ఆలయానికి ముందు భాగంలో నంది మండపం ఉంటుంది.. దానికి ముందు ప్రధాన ద్వారం ఎంట్రెన్స్ ఆర్చి ఉంటుంది.. దానికి ముందు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటుంది. ఆలయానికి కుడివైపున హనుమద్గిరి కొండ… ఎడమవైపున కాలభైరవ కొండా, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందు వైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి.

ఎటుచూసినా నాలుగు వైపులా గుట్టలు.. పైగా పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ ఆలయంలోకి ఏ కోషాన సూర్యకిరణాలు పడే అవకాశం లేదు.. మూడు ప్రధాన ద్వారాలు పూర్తిగా కిందికి ఉంటాయి.. ఆలయం లోపలికి వెళ్లే భక్తులు కూడా ఆ ద్వారాల వద్ద తలకు తాకకుండా కిందికి వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.. ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితులను సూర్య రష్మి చయాలు గర్భగుడిలో పడే అవకాశమే లేదు.

కానీ ప్రతిఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తుంది.. సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 5. 55 నిమిషాల నుండి 6 గంటల మధ్య అంటే ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలు నేరుగా శివలింగం పై పడి ఈ స్వయంభు శివలింగానికి పునశక్తిని ప్రసాదిస్తున్నాయి.కేవలం మూడు రోజులు మాత్రమే శివలింగంపై సూర్యకిరణాకు పడడం ఇది కచ్చితంగా పరమేశ్వరుడి మహత్యమే అని భక్తులు భావిస్తున్నారు.. సూర్య దర్శనం అనంతరం నాగుపాము వచ్చి శివలింగం చుట్టు ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకుంటుందని ప్రతిథి.

అసలు ఈ ఆలయం యొక్క విశిష్టతలేంటి..? కేవలం మూడు రోజులు మాత్రమే సూర్యకిరణాలు ఇలా గర్భగుడిలోని స్వయంభు సిద్దేశ్వర శివలింగాన్ని ఎలా తాకుతున్నాయి.. ఆ మహత్యంలో ఉన్న రహస్యం ఏoటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇది ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో…? లేక నిజంగా శివుడి మహత్యమో ఏమో కానీ భక్తులకు మాత్రం ఓ విచిత్రంగా కనిపిస్తుంది.. సూర్య దర్శనం అనంతరం శివుడికి కొత్త శక్తి లబిస్తుందని భావిస్తున్న భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సన్ మిరాకిల్ పట్ల అక్కడి భక్తులు ఆశ్చర్య పోతున్నారు.

ఈ విచిత్రాన్ని చేదించేందుకు ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ, ఎన్ఐటి కి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు.. కానీ వారికి కూడా అంతు చిక్కడం లేద.. కేవలం ఈ మూడు రోజులు మాత్రమే ఎలా సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగంపై పడుతున్నాయో ఇంజనీరింగ్ నిప్పులకు అంతు చిక్కడం లేదు.. భక్తులకు అర్థం కావడం లేదు. దీంతో ఇది ఖచ్చితంగా పరమశివుడి మహత్యమే అని భావించి పులకరించి పోతున్నారు భక్త జనం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం