Andhra Pradesh: రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకున్నాం.. తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఇవాళ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఇవాళ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే పొత్తు పెట్టుకున్నామని, తాడేపల్లిగూడెం సభ చూసి తాడేపల్లి కంపించిపోతుందని, త్వరలో రాష్ట్రానికి నవోదయం రాబోతుందని చంద్రబాబు అన్నారు.
‘‘మేం చేతులు కలిపింది అధికారం కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే చేతులు కలిపాం.. మేం చేతులు కలిపింది రాష్ట్రం కోసం. ఐదుకోట్ల మంది భవిష్యత్తు కోసం.. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అహంకారంతో విధ్వంసం చేస్తుంటే కూర్చోలేను. ఎదురించే తత్త్వం ఉన్న పవన్ అండగా ఉండటంతో మౌనంగా ఉండలేకపోయా’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
‘‘ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో మేం 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 10లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుందా? లేదా? మీరే చెప్పాలి. విధ్వంస పాలనను తిప్పికొట్టేందుకే పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసమే చేతులు కలిపాం’’ అని టీడీపీ అధినేత అన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలనే పొత్తు పెట్టుకున్నామని అన్నారు. కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయని, కోట్లు సంపాదించుకునే మార్గాలు వదిలి మీ కోసం వచ్చానని పవన్ అన్నారు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు అని, బలిచక్రవర్తి కూడా వామనుడ్ని ఇంతేనా అన్నారు. 24సీట్లు ఇంతేనా అని మనవాళ్లు కాదు అవతలి వాళ్లు అంటున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.



