Watch Video: భార్య పోరుపడలేక.. రోడ్డుపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య! వీడియో వైరల్
నడిరోడ్డుపై పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. ఓ వ్యక్తి ఒంటికి నిప్పంటిచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శుక్రవారం (ఆగస్ట్ 29) ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండ గానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు..
విశాఖపట్నం, ఆగస్ట్ 30: విశాఖపట్నంలో నడిరోడ్డుపై పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. ఓ వ్యక్తి ఒంటికి నిప్పంటిచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శుక్రవారం (ఆగస్ట్ 29) ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండ గానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి నట్లు ప్రాథమిక సమాచారం.
బాధితుడిని చిన్నారావుగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారావు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆరిలోవలో నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటీంచుకున్న చిన్నారావు.. అందరూ చూస్తుండ గానే పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 80% గాయాలతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. కుటుంబ కలహాలే చిన్నారావు మృతికి కారణని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








