Andhra Pradesh: బాబు ప్రమాణ స్వీకారానికి గంటా, జగన్ ప్రమాణోత్సవానికి బొత్స.. ఉత్తరాంధ్రలో వింత ఆహ్వానాలు..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాల కోసం అందరం ఎదురుచూస్తున్న క్రమంలో ఉత్తరాంధ్ర లో ఒక ఆసక్తికర రాజకీయం సాగుతోంది. మా అధినేతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఇద్దరు కీలక నేతలు సవాళ్లు విసురుతున్నారు. సవాల్ ప్రతి సవాల్‌తో పోలింగ్ ముగిశాక కూడా ఉత్తరాంధ్ర రాజకీయాలను మరింత హీట్ పెంచుతోంది.

Andhra Pradesh: బాబు ప్రమాణ స్వీకారానికి గంటా, జగన్ ప్రమాణోత్సవానికి బొత్స.. ఉత్తరాంధ్రలో వింత ఆహ్వానాలు..!
Ganta Srinivas And Botsa Satyanarayana
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 18, 2024 | 4:46 PM

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి అంతుచిక్కని ఎన్నికల ఫలితాల కోసం అందరం ఎదురుచూస్తున్న క్రమంలో ఉత్తరాంధ్ర లో ఒక ఆసక్తికర రాజకీయం సాగుతోంది. మా అధినేతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఇద్దరు కీలక నేతలు సవాళ్లు విసురుతున్నారు. సవాల్ ప్రతి సవాల్‌తో పోలింగ్ ముగిశాక కూడా ఉత్తరాంధ్ర రాజకీయాలను మరింత హీట్ పెంచుతోంది.

ఆ ఇద్దరూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దందులే. ఒకప్పటి ఆప్త మిత్రులే. చాలా సారూప్యాలు కూడా ఇద్దరి మధ్య ఉన్నాయి. ఓకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ఎన్నికల్లోనే గెలిచి ఇద్దరూ ఒకేసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నుండి నేటి వరకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేశారు. ఇద్దరూ మిత్రులైనా తాజాగా రాజకీయ ప్రత్యార్థులుగానే కొనసాగుతున్నారు. పార్టీలు వేరైనా ఒకానొక టైమ్ లో మంత్రి వర్గంలో సహచరలుగా పని చేశారు. అయితే అదంతా గతం అంటూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఇక్కడ ఉండబోరంటూ తాజాగా మరోసారి ఆధిపత్యం కోసం తలపడ్డారు.

మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఒకరు జూన్ 9న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని స్టేట్‌మెంట్ ఇస్తుంటే, మరొకరు అదే జూన్ 9న విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనీ కౌంటర్ ఇస్తున్నారు. మాజీ మంత్రి హోదాలో మీకు ఆహ్వానం ఉంటుంది. మీరు కూడా రావచ్చంటూ తన పాత మిత్రుడికి ముందస్తు ఆహ్వానం కూడా ఇస్తున్నారు. అసలు ఆ ఇద్దరు మిత్రులు ఎవరు… ఇప్పుడు ఎందుకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ వేదికగా ఇప్పుడు ఎందుకు రాజకీయాన్ని నడుపుతున్నారు..?

ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం జిల్లాలకు కీలకమైన రాజకీయ నాయకులుగా మంత్రి బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాస్ తమ బలాన్ని చూపిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బొత్స, టీడీపీ నుంచి గంటా 1999లో ఇద్దరూ ఒకేసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడిగి పెట్టారు. బొత్స సత్యనారాయణ బొబ్బిలి ఎంపీగా, గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా తొలి అడుగులోనే విజయం సాధించి ఢిల్లీలో రాజకీయ పాఠాలు నేర్చారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స, చోడవరం నుంచి గంటా ఇద్దరు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

ఒక్క 2014లో మాత్రం రాష్ట్ర విభజన తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి బొత్స సత్యనారాయణ తొలిసారి ఓటమిని చూస్తే, రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరూ మంచి మిత్రులు. ఒకే సామాజిక వర్గానికి కూడా చెందిన వారు కావడంతో, పార్టీలు వేరైనా ఆప్తమిత్రులుగా కొనసాగుతూ వచ్చారు కూడా. 2004 లోనే బొత్స రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2009 లో కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం తర్వాత గంటా శ్రీనివాసరావు కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో చేరడంతో ఇద్దరూ మంత్రివర్గ సహచరులుగా కూడా కలిసి పనిచేశారు.

ఒకప్పటి మిత్రులు నేటి ప్రత్యర్ధులు

రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స 2014లో తొలిసారి ఓటమి తర్వాత వైసీపీలోకి వెళ్లారు. గంటా టీడీపీకి తిరిగి వెళ్లడంతో రాజకీయ మిత్రులుగా ఉన్న ఇద్దరు పైకి మాత్రం ప్రత్యర్థులుగా మారిపోయారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా ఉన్ననాటి నుంచే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం అయింది. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటివి జరిగినా, మళ్ళీ కలిసి ఉన్నట్టే నటించేవారు.

అయితే చీపురుపల్లినే నమ్ముకుని రాజకీయం చేస్తున్న బొత్సపై ప్రతి ఎన్నికలలో నియోజకవర్గం మారే గంటాను ఈసారి ఎన్నికల్లో ప్రయోగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. ఉత్తరాంధ్రకే కీలకమైన నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణని ఓడిస్తే, ఉత్తరాంధ్రపై పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చు అని భావించిన చంద్రబాబు గంటా శ్రీనివాస్ ను చీపురుపల్లి నుండి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బలిలోకి దించాలని అనుకున్నారు. అయితే, గంటాకు ఇష్టం లేకపోవడంతో, ఒకానొక టైంలో చీపురుపల్లికి వెళ్లడానికి సిద్ధమైనా చివరికి భీమిలి నుండి బరిలోకి దిగడానికి గంట శ్రీనివాస్ చంద్రబాబును ఒప్పింపించారు. దీంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న పోరు తప్పింది. కానీ భీమిలి అసెంబ్లీ ఉన్న విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలోకి దిగడంతో ఆమెను గెలిపించే బాధ్యత తీసుకున్న బొత్స, భీమిలి లో గంటాపై దృష్టి పెట్టాడు. దాదాపుగా గంటాపై బొత్సనే పోటీ చేసిన స్థాయిలో టార్గెట్ చేస్తూ రాజకీయం చేశారు బొత్స సత్యనారాయణ.

మా అధినేతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటున్న ఇద్దరు నేతలు

తాజాగా ఎన్నికల అయిపోయాయి. అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ లేనిదీ ఇప్పుడు ఇద్దరూ మిత్రులు రాజకీయ శత్రువులుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, ఉత్తరాంధ్ర రాజకీయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న జూన్ 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంట శ్రీనివాసరావు జోస్యం చెప్తుంటే, ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండగా పేరు ఉన్న బొత్స సత్యనారాయణ ఇంకోక అడుగు ముందుకేసి అదే జూన్ 9న విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనీ, మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు కూడా ఆహ్వానం పంపుతామని, తప్పకుండా రావాలంటూ బొత్స కౌంటర్ వేస్తున్నారు.

దీంతో ఇద్దరి మధ్య పైకి కనిపించని రాజకీయ శత్రుత్వం మరోసారి బయటపడింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు తర్వాత ఆపార్టీకి, చంద్రబాబుకు కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. అధికార వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ప్రచారం మాత్రమే కాదు. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకవేళ ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే టీడీపీని అంటి ముట్టనట్లు ఉన్నాడన్న పేరును పోగొట్టుకోవడానికి గంటా శ్రీనివాసరావు మళ్ళీ మంత్రి పదవికోసం చంద్రబాబు ముఖ్యమంత్రి, ప్రమాణ స్వీకారం అని .మాట్లాడుతూ ఉన్నారని, కూటమి అధికారం లోకి వచ్చేది కలే అంటున్నారు బొత్స. అయితే ఏ పార్టీ గెలుస్తుందో తల పండిన విశ్లేషకులకు సైతం అంతు చిక్కని ఈ ఫలితాలు ఎలా ఉంటాయో ఏమో కానీ, ఆ ఫలితాల వేదికగా ఈ నేతల ఇద్దరి మద్య జరుగుతున్న ప్రమాణ స్వీకార వివాదం మాత్రం తాజా ప్రస్తావనాంశంగా మారింది. ఎవరి ప్రమాణ స్వీకారానికి ఎవరు వస్తారో అన్న చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!