AP: ఏపీలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు.. మంత్రి బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్

ప్రజాప్రతినిధులకి పోలీసులు గులాంగిరి చేస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేంటంటూ.. కార్యకర్తల్ని మించి భక్తి చాటుకుంటున్నారు.

AP: ఏపీలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు.. మంత్రి బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్
మంత్రి బొత్స కాళ్లు మొక్కిన ఐఏఎస్
Follow us

|

Updated on: Jan 02, 2022 | 12:28 PM

ప్రజాప్రతినిధులకి పోలీసులు గులాంగిరి చేస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేంటంటూ.. కార్యకర్తల్ని మించి భక్తి చాటుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందన్న సంగతి మరచి.. నేతల ముందు వంగి వంగి దండాలు పెడుతున్నారు. పోస్టింగ్‌లు, ట్రాన్స్‌ఫర్‌లు లేకుండా ఉండేందుకే అలా చేస్తున్నారా? వాటి కోసం మరీ అంత దిగజారాలా? రీజన్స్‌ ఏవైనా.. ఖాకీలు ఖద్దర్‌కి దాసోహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లీడర్‌ పుట్టిన రోజు వేడుకల్లో కేడర్‌ హడావుడి చేయడం మామూలే. అయితే ఇప్పుడా పని పోలీసులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కడపజిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి బర్త్ డే వేడుకలు గత నెల 20న జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తల్లా మారిపోయారు. ఎమ్మెల్యేకి బొకేలు ఇచ్చి అభిమానాన్ని, దండలు వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. నిజానికి ఇక్కడెవరూ కార్యకర్తలు లేరు. అన్నీ తామై నడిపించారు పోలీసులు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోలీసుల అత్యుత్సాహం పీక్‌కి వెళ్లిపోయింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తండ్రి రామస్వామిని ఘనంగా సన్మానించారు. ఏ ప్రొటోకాల్‌ లేని రామస్వామికి సీఐ, ఎస్సైలు సెల్యూట్‌ చేశారు. దండలు వేసి, ఫ్లవర్‌ బొకేలు ఇచ్చి ఎమ్మెల్యే ఫాదర్‌ని ఫిదా చేశారు. కేక్ కటింగ్‌ చేసి వీర విధేయత ప్రదర్శించారు.

లెటెస్ట్‌గా విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్ కుమార్‌ అయితే ఏకంగా మంత్రికి పాదాభివందనం చేశారు. తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జేసీ కిషోర్ కుమార్‌. ఈ క్రమంలో మంత్రికి ఫ్లవర్ బోకే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కాళ్లు మొక్కారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిస్వార్ధంగా ఉండే ఐఏఎస్‌లు ఇలా మంత్రులకి భజన చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు

సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే