AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పై ఫోటోలోనివి పార్కింగ్‌లో పెట్టిన బైక్‌లు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌటే.!

వాళ్లిద్దరూ కొబ్బరికాయల ట్రాన్స్‌పోర్టర్లు.. కోనసీమ జిల్లాల నుంచి కొబ్బరికాయలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. కానీ.. వాళ్లిద్దరూ ఉన్నట్టుండి బుల్లెట్లపై మోజు పెంచుకున్నారు. అదీ కూడా మెట్రో సిటీస్‌లో బుల్లెట్లపైనేనట.. ఇంతకీ ఆ ఇద్దరికీ బుల్లెట్ల పైన ఎందుకు మక్కువ.? నగరాలనే ఎందుకు టార్గెట్ చేశారు.? పై ఫోటోలో కనిపిస్తున్నవన్నీ.. ఏదో సండే మార్కెట్లో పెట్టే బైక్‌లు కాదు..

పై ఫోటోలోనివి పార్కింగ్‌లో పెట్టిన బైక్‌లు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌటే.!
Vizag News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 03, 2023 | 8:11 PM

Share

వాళ్లిద్దరూ కొబ్బరికాయల ట్రాన్స్‌పోర్టర్లు.. కోనసీమ జిల్లాల నుంచి కొబ్బరికాయలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. కానీ.. వాళ్లిద్దరూ ఉన్నట్టుండి బుల్లెట్లపై మోజు పెంచుకున్నారు. అదీ కూడా మెట్రో సిటీస్‌లో బుల్లెట్లపైనేనట.. ఇంతకీ ఆ ఇద్దరికీ బుల్లెట్ల పైన ఎందుకు మక్కువ.? నగరాలనే ఎందుకు టార్గెట్ చేశారు.?

పై ఫోటోలో కనిపిస్తున్నవన్నీ.. ఏదో సండే మార్కెట్లో పెట్టే బైక్‌లు కాదు.. పార్కింగ్‌లో పెట్టిన టూవీలర్లు అంతకంటే కాదు.. దాదాపుగా అన్ని కొత్త బైక్‌లే..! అవి కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లే ఎక్కువ. సిటీలో వేర్వేరు చోట నుంచి ఒక్కొక్కటిగా మాయమైపోయిన బైక్‌లు..! ఇవన్నీ ఓ ఇద్దరి చేతిలోకి వెళ్లిపోయాయి. వాటన్నిటినీ పట్టుకొచ్చారు పోలీసులు.

అసలు విషయం ఇదే..

డైరెక్ట్‌గా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. విశాఖకు చెందిన యశ్వంత్ మర్రిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఆగష్టు 27న ఇంటి ముందు పార్కింగ్ చేసిన బుల్లెట్ మాయమైంది. రాత్రి పార్క్ చేసి తెల్లారి చూసేసరికి కనిపించకుండాపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు బాధితుడు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఖాకీలు. ఈలోగా మరికొన్ని బైకులు కూడా సిటీలో మాయమవుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇక దర్యాప్తున వేగవంతం చేశారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. నిందితుల కదలికలను గుర్తించారు. చివరకు కోనసీమ జిల్లాకు చెందిన రొక్కం పవన్ కుమార్‌ను పట్టుకుని విచారించారు. పోలీస్ ట్రీట్మెంట్‌లో అడిగేసరికి.. తన స్నేహితుడు మేడిద శ్రీనివాసరావు పేరు కూడా చెప్పాడు.

చేసేది కొబ్బరికాయల వ్యాపారం..

అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పవన్ కుమార్, మెడిద శ్రీనివాసరావు.. ఇద్దరూ కొబ్బరికాయల వ్యాపారస్తులు. లారీలో కొబ్బరికాయలను తీసుకెళ్లి వేరే ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటారు. అయితే వీరికి బిజినెస్‌లో కొంత లాస్ అయింది. దీంతో ఈజీ మనీకి అలవాటుపడ్డారు. ఇక చెప్పేదేముంది.. ఇళ్లలో చోరీలు, చైన్స్ స్నాచింగ్‌లు చేస్తే.. పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందని.. ఈజీగా పట్టుబడతామని అనుకున్నారు. బైక్‌లను చోరీలు చేస్తే.. పోలీస్ స్టేషన్లకు అన్ని ఫిర్యాదులు రావని అనుకొని.. ఆ వైపు దృష్టి సారించారు. ఎక్కడో గ్రామాల్లో ఒకటి అరా బైక్‌లే కనిపిస్తుండటం.. గ్రామాల్లో ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోతాం అన్న భయంతో బిజీ ప్రాంతాల్లో ఉండే బైక్‌లపై కన్నేశారు. బిజీ సిటీస్‌పై పడి.. ఈ ఇద్దరూ పని ప్రారంభించేసారని అన్నారు క్రైమ్ డీసీపీ నాగన్న.

వైజాగ్ ..హైదరాబాద్.. వరంగల్..

ఇలా.. పవన్ కుమార్ స్నేహితుడైన శ్రీనివాసరావు.. కొబ్బరికాయల వ్యాపారంలో అందరినీ మోసంలో చేస్తూ జల్సాలకు అలవాటు పడిపోయాడు. దీంతో పవన్ కుమార్ కూడా విజినెస్‌లో లాస్ అయ్యాడు. ఇద్దరికీ ఎలక్ట్రికల్‌లో పరిజ్ఞానం ఉంది. దీంతో బైక్లను ఎలా చోరీ చేయాలన్నది శ్రీనివాసరావు.. పవన్ కుమార్‌కు నేర్పించాడు. ఇలా బైక్లు చోరీలు చేయడం.. వాటిని అమ్మడం ప్రారంభించారు. ఇలా విశాఖలో ఆరు టూవీలర్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో పాటు విజయవాడలో, వరంగల్‌లో, హైదరాబాద్ లాంటి సిటీస్‌లో టార్గెట్ చేసి చోరీలు చేశారు. ఏకంగా 10 బైకులను ఎత్తుకెళ్లిపోయారు. పదిలో 7 బైకులు బుల్లెట్లు కావడం విశేషం.

విశాఖలో చోరీ కేసు కూపీ లాగితే..

విశాఖలో బుల్లెట్ చోరీ కేసును కూపీ లాగితే.. మెట్రో సిటీస్‌లో బైక్లను చోరీ చేసే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా ఏడు బుల్లెట్లతో పాటు 10 బైక్లను సీజ్ చేశారు పోలీసులు. వీటి విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా. బుల్లెట్లే ఎక్కువ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే.. లాక్ ఓపెన్ చేయడం ఈజీ, దీంతో పాటు స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లడం కూడా సులువైన పనిగా చెప్పుకొచ్చాడు పవన్ కుమార్. వాటితో పాటు రీసేల్ వాల్యూ కూడా బుల్లెట్లకు ఎక్కువగా వస్తుండటంతో.. ఎక్కువగా ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లను టార్గెట్ చేసి ఎత్తుకు వెళ్లిపోతున్నారు. అయితే చోరీకి గురవుతున్న వాహనాలన్నీ.. యజమానులలో అలసత్వం ఏమరపాటే ఈ ఇద్దరు దొంగలకు కలిసి వచ్చిందని అన్నారు డీసీపీ క్రైమ్ నాగన్న.

వైజాగ్ కేసులో దర్యాప్తు చేస్తే.. హైదరాబాద్ విజయవాడ వరంగల్ చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. రొక్కం పవన్ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. అయితే ఎవరికి వారు టూ వీలర్‌ను.. సేఫ్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. తాళాలు కొంతమంది బైకులకే వదిలేయడం, మరికొంతమంది సీసీ కెమెరాలు లేని చోట పార్కింగ్ చేయడంతో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..