Visakhapatnam: కాలుష్యానికి చెక్ పెట్టే కొత్త ఆలోచన.. రంగంలోకి నేవీ హెలికాప్టర్లు.. ఏం చేస్తాయంటే..

Seed Ball Campaign: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 9వ నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. అంతే స్థాయిలో అత్యంత కాలుష్య ప్రమాదకర నగరాలలో కూడా విశాఖ ముందుంది. బహుశా దేశంలోనే కాలుష్య రహిత నగరాల్లోని మొదటి 15 నగరాల జాబితాలో వైజాగ్ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే వైజాగ్ నే అత్యంత కాలుష్య బాధిత నగరం. ఇలాంటి విశాఖలో కాలుష్యం నియంత్రణ కి స్థానిక ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. అయినా నియంత్రణ లోకి రావడం లేదు.

Visakhapatnam: కాలుష్యానికి చెక్ పెట్టే కొత్త ఆలోచన.. రంగంలోకి నేవీ హెలికాప్టర్లు.. ఏం చేస్తాయంటే..
Navy Helicopters
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Oct 03, 2023 | 9:36 PM

విశాఖపట్నం, ఆక్టోబర్ 03: ప్రధానంగా విశాఖ నగరం తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యన ఉంటుంది. తూర్పు కనుమల్లో ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉంటాయి. దీంతో గ్రీనరీ కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. అయినా అంతకు మించిన కాలుష్యం విశాఖలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. విశాఖలో కాలుష్యానికి ప్రధానమైన కారణం విశాఖ పోర్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. విశాఖ పోర్టులో కమర్షియల్ కంటైనర్ టర్మినల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలోనే మేజర్ పోర్టులలో మూడో పోర్టుగా విశాఖకి పేరు ఉంది.

ఏటా భారీ స్థాయిలో ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో దాని కాలుష్యం నగరం పై ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నగరం బౌల్ ఆకారంలో ఉంటుంది, దీంతో లోపలి కాలుష్యం బయటకు వెళ్ళే మార్గం లేక నగరాన్ని చుట్టేస్తూ ఉంటుంది. దీనికి తోడు, పలు పరిశ్రమలు ఫార్మా లాంటి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను సరిగా ట్రీట్ చేసే వ్యవస్థలు కానీ, వాటిని మానిటర్ చేసే పకడ్బందీ యంత్రాంగాలు కానీ లేవు. దీంతో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.

హెలికాప్టర్ ద్వారా కొండపై సీడ్ బాల్స్ చల్లిన జీవీఎంసీ..

నగరాన్ని అత్యంత నివాసయోగ్య నగరం గా మార్చాలన్నది విశాఖ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ టార్గెట్. దీనికోసం నగరంలో పచ్చదనం అభివృద్ధి చేయడానికి విస్తృత చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా జీ వి ఎం సి కి కమిషనర్ గా సీఎం సాయి కాంత్ వర్మ వచ్చాక ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎక్కువగా తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఏడుకొండలపై సీడ్ బాల్స్ ను చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ సహాయం తీసుకున్నారు. గ్రీన్ క్లైమేట్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పెద్ద యెత్తున సీడ్ బాల్స్ ను చల్లారు.

4 హెలికాప్టర్ల ద్వారా 6 లక్షల సీడ్ బాల్స్..

నగరంలో ఏడు కొండలపై సీడ్ బాల్స్ విడుదల చేసే కార్యక్రమానికి ఈస్ట్రన్ నేవల్ కమాండ్, గ్రీన్ క్లైమేట్ సంస్థ సహకారాన్ని తీసుకున్న జీవీఎంసీ 4 హెలికాప్టర్ల ద్వారా సుమారు 6 లక్షల విత్తనాలను సేకరించి నగరంలోని పావురాల కొండ 1, 2, కాపులుప్పాడ, సింహాచలం, పొర్లుపాలెం కొండ వేదుళ్లనరవ కొండ, యారాడ కొండలపై విడుదల చేసినట్లు మేయర్ హరి వెంకట కుమారి టీవీ9 కు తెలిపారు. దీనికోసం నేవి విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగా వద్ద నేవల్ అధికారులతో కలిసి హరివెంకటకుమారి ప్రారంభించారు. విత్తన బంతులతో విశాఖను హరిత వనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి