Youth Suicide: విశాఖపట్నంలో విషాదం.. కుక్క పిల్ల కోసం ప్రాణాలు తీసుకున్న యువకుడు..

Youth Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కపిల్ల కోసం ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

Youth Suicide: విశాఖపట్నంలో విషాదం.. కుక్క పిల్ల కోసం ప్రాణాలు తీసుకున్న యువకుడు..
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2021 | 8:20 PM

Youth Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కపిల్ల కోసం ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. పప్పీని కొనేందుకు డబ్బులు ఇవ్వనందుకు మనస్తాపానికి గురైన యువకుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదహారేళ్ళ షణ్ముక వంశీ ఇంట్లో ఒక్కగానొక్క సంతానం. వంశీ తండ్రి గతంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తల్లే అతని ఆలనాపాలనా చూస్తూ.. పెంచి పెద్దవాడిని చేసింది. వంశి తల్లితో కలిసి వెంకటేశ్వరమెట్ట ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న వంశీకి పెంపుడు జంతువులంటే ఇష్టం. అందులోనూ డాబర్‌మెన్‌ డాగ్‌కోసం ఎప్పుడూ తాపత్రయపడేవాడు.

అయితే.. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉన్న షణ్ముక వంశీ… సెల్‌ఫోన్‌తో టైమ్‌పాస్ చేస్తున్నాడు. అలా ఇంటర్నెట్‌లో షాపింగ్ సైట్స్‌ సెర్చ్ చేస్తుండగా.. ఓ పప్పీ కనిపించింది. దానిని చూసి ముచ్చపటపడ్డ వంశీ.. ఎలాగైనా సరే కొనుగోలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే.. తన తల్లిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. రూ. 10 వేలు ఇస్తే.. పప్పీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తానని తల్లిని బ్రతిమాలాడు. అయితే, వంశీ రిక్వెస్ట్‌కు తల్లి నిరాకరించింది. పదివేలు ఎక్కడి నుంచి తేవాలంటూ కొంచె మందలించింది.

దాంతో మనస్తాపానికి గురైన వంశీ.. తల్లి ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన పక్కింటి వాళ్లు.. వంశీని ఉరితాడు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వంశీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వంశీ మృతితో అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. అటు భర్తను కోల్పోయి.. ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు కూడా దూరం అవడంతో ఆ తల్లి ఆక్రందన వర్ణనాతీతం. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సబ్యులకు అప్పగించారు.

Also read:

దేశంలో ప్రస్తుతానికి అదుపులోనే కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్……అయినా అప్రమత్తత అవసరమంటున్న కేంద్రం

Viral News: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!