Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో తొలగని ఉత్కంఠ.. హైకోర్టులో వాదోపవాదాలు.. చివరికి న్యాయ స్థానం ఏం చెప్పిందంటే..!

అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్‌ను ప్రైవేట్ ఏజన్సీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన సదరు పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో తొలగని ఉత్కంఠ.. హైకోర్టులో వాదోపవాదాలు.. చివరికి న్యాయ స్థానం ఏం చెప్పిందంటే..!
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 15, 2021 | 7:58 PM

Andhra Pradesh High court : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అనిశ్చితి తొలగడంలేదు. త్వరలోనే గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు జరగనుండాల్సి ఉండగా, కోర్టు కేసుల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో ఎనిమిది పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్‌ను ప్రైవేట్ ఏజన్సీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన సదరు పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థ టీసీఎస్‌ చేయడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూషన్‌ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

అంతేకాదు, మెయిన్ పరీక్ష కు సంబంధించి తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని, దీంతో ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్‌ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

అయితే, నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

Read also : Maoist Sympathisers : తూ.గో జిల్లా మన్యంలో మావోలకు లక్షల రూపాయల సొమ్ములు తరలిస్తోన్న సానుభూతిపరులు అరెస్ట్