AP Curfew: కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 20 తర్వాత నుంచి కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు..
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 20 తర్వాత నుంచి కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సడలింపులు ఇస్తూ కర్ఫ్యూను మరికొన్ని రోజులు కొనసాగించాల్సి ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కర్ఫ్యూలో సడలింపులు ఇచ్చే అవకాశముందని చెప్పుకొచ్చారు.
అలాగే కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని.. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని చెప్పారు. కాగా, జూన్ 22న ‘వైఎస్సార్ చేయూత’ పధకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పిన జగన్.. దీని కోసం కలెక్టర్లు అంతా సిద్దం కావాలని ఆదేశించారు. అటు జూలైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామని.. వైఎస్సార్ బీమా పధకం జూలై 1న ప్రారంభం అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Also Read:
ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి
కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!
అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో..