Accident : అమర్ రాజా కంపెనీ బస్పు – లోడు లారీ ఢీ.. 15 మందికి గాయాలు. నాయుడుపేట జాతీయ రహదారి మీద యాక్సిడెంట్
తిరుపతి రేణిగుంట ప్రాంతంలో ఈ సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి మీద రేణిగుంట సమీపంలో ఈ రోడ్డుప్రమాదం..
Amar Raja Company Bus – Load Larry collision : తిరుపతి రేణిగుంట ప్రాంతంలో ఈ సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి మీద రేణిగుంట సమీపంలో ఈ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అమర్ రాజా కంపెనీకి చెందిన బస్సు – కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో కంపెనీ బస్సులో ఉన్న కంపెనీ ఉద్యోగులు 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్ క్రమంలో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ల ఏమరపాటు, రెండు వాహనాలు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలాన్ని రేణిగుంట తాసిల్దార్, రేణిగుంట అర్బన్ సీఐ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని రేణిగుంట అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని హుటాహుటీన రేణిగుంట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read also : VHP : అయోధ్య శ్రీరామాలయానికి సమర్పించిన ప్రతి రూపాయికి ట్రస్టు జవాబుదారిగా ఉంటుంది : అలోక్ కుమార్