Andhra Pradesh: ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం..!

ఆదివారం సెలవు రోజు కావడంతో పిల్లల పాలెం వెళ్లిన ఇద్దరూ సరదాగా ఫోటోలు దిగుతున్నారు. ఫోటోల కోసం వారు తాచెరు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. అక్కడ ఓ రాయిపై నిల్చొని చంద్ర మోహన్ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి నీటిలో పడిపోయాడు.

Andhra Pradesh: ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం..!
Two youth drown in Anakapalli district
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 09, 2024 | 7:00 PM

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన విహార యాత్ర వారిపాలిట విషాదంగా మారింది. ఫోటో సరదా రెండు కుటుంబాల్లోని ఇద్దరు కుమారులను బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం బిల్లలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నీటి కాలువలో పడి గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మృతులిద్దరూ బావ బావ బావమరుదులు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…

మాడుగుల మండలం తాటిపర్తి శివారు బిల్లల పాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం తాచేరువు పరిసర ప్రాంతాల్లో విహారానికి వెళ్ళింది. చంద్ర మోహన్, జ్ఞానేశ్వర్ ఇద్దరూ బావ బావ మరదలు. వారిలో గుర్రం చంద్రమోహన్ అనే వ్యక్తి జీవీఎంసీ మెడికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. జ్ఞానేశ్వర్ ఆరిలోవలో పొలిటికల్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో పిల్లల పాలెం వెళ్లిన ఇద్దరూ సరదాగా ఫోటోలు దిగుతున్నారు. ఫోటోల కోసం వారు తాచెరు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. అక్కడ ఓ రాయిపై నిల్చొని చంద్ర మోహన్ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి నీటిలో పడిపోయాడు.

అక్కడే ఉన్న జ్ఞానేశ్వర్ చంద్రమోహన్‌ను రక్షించేందుకు నీటిలో దూకాడు. ఇద్దరూ ఊబి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోవడంతో బయటకు రాలేక పోయారు. అక్కడే ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు అంతా కూడా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు.. నీటిలో మునిగిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మాత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. చందుకి గత నెలలోనే వివాహమైనట్టుగా తెలిసింది. వి మాడుగుల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..