- Telugu News Photo Gallery Raw Milk For Facial Know How To Use For Glowing Skin Telugu Lifestyle News
Raw Milk For Facial: పచ్చిపాలతో మెరిసే అందం..! ముఖంపై మచ్చలు తగ్గుతాయట..
పచ్చి పాలను ముఖానికి వాడటం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. పచ్చి పాలను ముఖానికి ఎందుకు వాడతారో తెలుసా? నిజానికి, పాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. పాలను ముఖానికి పట్టించడం వల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. మీ ముఖానికి పచ్చి పాలను అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2024 | 5:23 PM

మహిళలు తమ చర్మాన్ని మెరుస్తూ ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో లభించే అనేక ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఇలాంటివి వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ, మార్కెట్లో లభించే కెమికల్ ఆధారిత బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడటం వల్ల చర్మం మెరుపుకు బదులుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర అనేక సమస్యలని కలిగిస్తుంది. అయితే, కొందరు చర్మ ఛాయను మెరుగుపరచడానికి ఇంటి నివారణలను ఎక్కువగా పాటిస్తుంటారు. ఇంట్లో ఉండే లాభదాయకమైన వస్తువులు మిమ్మల్ని చాలా కాలం పాటు మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ఇకడ మరో బెస్ట్ ఏంటంటే..ఇలంటి సహాజ పద్ధతుల వల్ల మీ చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అలాంటి సౌందర్యా సాధనాల్లో పాలు కూడా ఒకటి. పాలతో మీ అందం పదిలంగా ఉంచుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

మొటిమలను తొలగిస్తుంది: పాలు మీ చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. మురికిని బయటకు పంపుతుంది. అంతే కాదు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఇది తామరకు కూడా చికిత్సగా పనిచేస్తుంది.

స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది: పచ్చి పాలు చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. పచ్చి పాలలో తేనె, పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. పచ్చి పాలతో చేసిన ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది: పాలలో బయోటిన్‌తో సహా అనేక మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల నిర్జీవంగా, పగుళ్లు ఏర్పడి, పొడిబారి వాడిపోయిన చర్మానికి పూర్తి పోషణ లభిస్తుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి తేమ చేస్తుంది.

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది: పచ్చి పాలలో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ ఉంటుంది. దీనిని బీటా హైడ్రాక్సీ యాసిడ్ అంటారు. ఇది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. మృత చర్మ కణాలను అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.





























