ఎలా వస్తాయ్ బ్రో ఇలాంటి ఐడియాలు .. పంక్చర్‌ అయిన టెంపోను భలే పరుగులు పెట్టించాడే..!!

టెంపో డ్రైవర్ చేసిన ఈ ఆలోచన ఇంతకు ముందు ఎవరికీ వచ్చి ఉండదనే చెప్పాలి. కానీ, ఇలాంటి డ్రైవింగ్‌ డ్రైవర్‌ను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టంట్ చేసే ముందు డ్రైవర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో @ghanthaa Instagram ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమాషాగా స్పందిస్తున్నారు.

ఎలా వస్తాయ్ బ్రో ఇలాంటి ఐడియాలు .. పంక్చర్‌ అయిన టెంపోను భలే పరుగులు పెట్టించాడే..!!
Tempo With Puncture Tyre
Follow us

|

Updated on: Jul 09, 2024 | 5:36 PM

ప్రయాణ సమయంలో కారు, బైక్, టెంపో, ట్రక్ వంటి వాహనాలకు టైర్‌ పంక్చర్‌ కావడం సాధారణంగా చూస్తుంటాం. అలాంటప్పుడు సమీపంలో మెకానిక్ ఉంటే మంచిది. లేకపోతే ఆ టైర్లను మార్చడం లేదా మరమ్మతు చేయడం కష్టంగా మారుతుంది. దాంతో ఆ వాహనదారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి పడిపోతుంటారు. అలాంటిదే ప్రస్తతుం ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్‌ వీడియోలో రోడ్డుపై వెళ్తున్న టెంపో టైర్‌ ఒకటి పంక్చర్‌ అయింది. దాంతో ఆ టెంపో డ్రైవర్‌ తన తెలివిని ఉపయోగించి కొత్త టెక్నిక్‌ ప్లే చేశాడు. ఈ సమస్యకు అతడు ఎవరూ ఊహించని పరిష్కారాన్ని కనిపెట్టాడు. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో చైనాకు చెందినది. వీడియోలో ముందుగా రోడ్డుపై వెళ్తున్న ఓ కారు డ్రైవర్‌ తన ముందు వెళ్తున్న టెంపోను వీడియో తీశాడు. ఆ టెంపో డ్రైవర్ చేసిన వింత పని ఆ కారు డ్రైవర్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ విచిత్ర సన్నివేశాన్ని అతడు పూర్తిగా రికార్డ్‌ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో టెంపో టైర్ ఒకటి పంక్చర్ అయింది. చుట్టుపక్కల మెకానిక్‌ గానీ, గ్యారేజీ గానీ కనిపించలేదు. దాంతో సమస్య పరిష్కారం కోసం ఒక వింత ఉపాయం చేశాడు. ఏం చేశాడో వీడియోలో చూడాల్సిందే..!

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ghantaa (@ghantaa)

మీరు వైరల్ వీడియోలో చూసినట్లుగా టెంపో టైర్‌లలో ఒకటి పంక్చర్ అయినట్టుగా కనిపిస్తుంది. దీంతో ప్రయాణం ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతడు స్మార్ట్‌గా ఆలోచించి.. టెంపో బ్యాలెన్స్‌ దెబ్బతినకుండా పంక్చర్‌ అయిన టైరు కింద స్కేటింగ్‌ బోర్డు పెట్టాడు ఆ డ్రైవర్‌. అలాగే, ఈ స్కేటింగ్ బోర్డు టెంపోకు తాడుతో కట్టేశాడు. దాంతో టెంపోను సాఫీగా నడిపిస్తూ మెకానిక్ వద్దకు తీసుకెళ్లవచ్చు. టెంపో డ్రైవర్ చేసిన ఈ ఆలోచన ఇంతకు ముందు ఎవరికీ వచ్చి ఉండదనే చెప్పాలి. కానీ, ఇలాంటి డ్రైవింగ్‌ డ్రైవర్‌ను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టంట్ చేసే ముందు డ్రైవర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో @ghanthaa Instagram ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమాషాగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!