AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద పులితో పరాచికాలు.. ముద్దులు పెడుతూ సరసాలు ఆడుతున్న యువతీ.. చూస్తే వామ్మో అనాల్సిందే

అవన్నీ చూస్తుంటే.. ఈ యువతికి తన జూలోని జంతువులన్నింటితో కలిసి సమయం గడపడం అంటే ఇష్టమని స్పష్టమవుతోంది. రియో జూలో ఏనుగులు, పులులు, సింహాలు, గొరిల్లాలతో సహా అనేక జంతువులు ఉన్నాయి. ఈ జూ అడవి జంతువులతో క్లోజ్-అప్ ఫోటోగ్రఫీ అవకాశాలను కూడా అందిస్తుంది. దాంతో ఇక్కడ జనం రద్దీ కూడా కనిపిస్తోంది. ఈ అడవి జంతువులు కూడా

పెద్ద పులితో పరాచికాలు.. ముద్దులు పెడుతూ సరసాలు ఆడుతున్న యువతీ.. చూస్తే వామ్మో అనాల్సిందే
Swimming With A Tiger
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2024 | 3:45 PM

Share

ప్రస్తుతం, వివిధ రకాల జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తున్నాయి. కొన్ని వీడియోలు భయంకరంగా ఉంటే, మరికొన్ని వీడియోల్లో ఆయా జంతువులు, పక్షుల విన్యాసాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. కొన్ని వీడియోల్లో కొందరు ప్రజలు సింహం, పులి వంటి క్రూరమృగాలను సైతం తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న సంఘటనలు చూశాం. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోలో ఓ మహిళ స్విమ్మింగ్ పూల్‌లో పులితో కలిసి ఈత కొడుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇన్‌స్టాగ్రామ్‌లో రియో లిల్లీ అనే ఇన్‌స్టా వేదికగా వీడియో పోస్ట్ చేయబడింది. కాలిఫోర్నియా నివాసి రియో​లిల్లీ స్విమ్మింగ్ పూల్‌లో పులితో కలిసి ఈత కొడుతోంది. ఆమెకు కాలిఫోర్నియాలో జూ ఉందని చెబుతారు. అక్కడి స్విమ్మింగ్ పూల్ లో పులితో కలిసి రియో సరదాగా స్విమ్మింగ్‌ చేస్తోంది. వీడియోలో, పులి కూడా స్విమ్మింగ్ పూల్‌లో హాయిగా ఎంజాయ్‌ చేస్తోంది. పైగా రియో వీపుపై వాలి స్విమ్‌ చేస్తోంది. అంతేకాదు.. ఆమె ఆ పులికి ప్రేమగా ముద్దులుగా కూడా పెడుతోంది. అంతే పులి ఒక్కసారి కళ్లు తిప్పి ఆమె వైపు చూసింది. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూసిన నెటిజన్లు కంగుతినాల్సి వచ్చింది. రియో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

స్విమ్మింగ్‌ పూల్‌లో పులితో కలిసి జాలిగా ఈత కొడుతున్న రియో.. ఆ పులికి ముద్దులు పెడుతుంటే.. ఆ పులి కూడా ఆమెను ప్రేమగా హత్తుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే.. వాళ్లిద్దరూ చాలా మంచి స్నేహితులని వీడియో ద్వారా తెలుస్తోంది. ఇద్ద‌రినీ క‌లిసి చూడ‌డం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. రియో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసి, ఈ పులి పేరు లక్ష్మణ్‌.. ఇది నా ఫ్రెండ్‌ అని క్యాప్షన్‌లో రాసింది. పులికి, మనుషులకు మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్‌లలో కూడా రకరకాల వ్యాఖ్యలు కనిపించాయి.

View this post on Instagram

A post shared by Rio Lilly (@rio_lilly)

వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు స్పందించారు. నాకు అలాంటి పులి కావాలి అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, లక్షణను చూడు.. ఆమె స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తోంది. అయితే ఇలాంటి మధురమైన చిత్రాన్ని చూసి చాలా మంది ముచ్చటించగా, కొందరు పులిని చూసి భయపడుతున్నారు. అయితే, ఇదేం మొదటిసారి కాదు. రియో ఇంతకు ముందు కూడా వివిధ అడవి జంతువులతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. అవన్నీ చూస్తుంటే.. ఈ యువతికి తన జూలోని జంతువులన్నింటితో కలిసి సమయం గడపడం అంటే ఇష్టమని స్పష్టమవుతోంది. రియో జూలో ఏనుగులు, పులులు, సింహాలు, గొరిల్లాలతో సహా అనేక జంతువులు ఉన్నాయి. ఈ జూ అడవి జంతువులతో క్లోజ్-అప్ ఫోటోగ్రఫీ అవకాశాలను కూడా అందిస్తుంది. దాంతో ఇక్కడ జనం రద్దీ కూడా కనిపిస్తోంది. ఈ అడవి జంతువులు కూడా ఎవరిపైన దాడి చేయవు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..