Watch: హెల్మెట్‌లో దూరిన జెర్రి.. కాసేపైతే ఏమయ్యేదో.!!.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

బైక్‌లు, స్కూటర్లు, కార్లు ఇలా పలు వాహనాల్లో పాములు దూరడం చూసుంటాం. స్నేక్‌ క్యాచర్ల సాయంతో వాటిని సురక్షితంగా బయటకు తీసిన వీడియోలు అనేకం చూశాం.ఇకపోతే, వర్షాకాలంలో ఇలా పాములు, జెర్రిలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వెచ్చని వాతావరణం కోసం వెతుకుతూ ఇలా వాహనాల్లో దాక్కుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ పై వెళ్లేందుకు హెల్మెంట్ బయటకు తీయగా అందులో..

Watch: హెల్మెట్‌లో దూరిన జెర్రి.. కాసేపైతే ఏమయ్యేదో.!!.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌
Jerri Hides inside a helmet
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:51 PM

నిత్యం ఎంతో మంది బైకులపై ఆఫీసులు, ఇతర పనుల మీద వెళ్తుంటారు. హడావుడిలో తమ వస్తువులను సరిగ్గా చూసుకోకుండానే వాడేస్తుంటారు. బైక్ హెల్మెంట్, బ్యాగ్స్, షూస్‌ వంటి వాటిని చెక్‌ చేయకుండానే ధరిస్తుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మృత్యువు వాటిలోనే దాగి ఉంటుందని తెలుసుకోరు. ఇందుకు ఉదాహరణగా గతంలో షూస్‌లో నాగుపాము పిల్ల దాగివున్న వీడియో వైరల్‌ కావటం చూశాం. అలాగే, స్కూటీలో దూరిన పాము కూడా వాహనదారులను బెంబేలెత్తిస్తుంటాయి. బైక్‌లు, స్కూటర్లు, కార్లు ఇలా పలు వాహనాల్లో పాములు దూరడం చూసుంటాం. స్నేక్‌ క్యాచర్ల సాయంతో వాటిని సురక్షితంగా బయటకు తీసిన వీడియోలు అనేకం చూశాం.ఇకపోతే, వర్షాకాలంలో ఇలా పాములు, జెర్రిలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వెచ్చని వాతావరణం కోసం వెతుకుతూ ఇలా వాహనాల్లో దాక్కుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ పై వెళ్లేందుకు హెల్మెంట్ బయటకు తీయగా అందులో నుంచి ఒక పెద్ద జేర్రీ పారుతూ బయటకు వచ్చింది.

వర్షాకాలంలో ఇలాంటి జెర్రిలు ఇంట్లో, ఇంటి పరిసరాల్లో తరచూ కనిపిస్తుంటాయి. శరీరంలోని ఏదైనా భాగంలో ఇది కాటు వేస్తే తీవ్రమైన మంట, జ్వరం కలిగిస్తుంది. ఈ తేనెటీగ కాటు ప్రాణాంతకం కానప్పటికీ, అది చెవిలోకి దూరితే మాత్రం అది చాలా ప్రమాదకరం. అయితే, హెల్మెట్‌లో దాగివున్న జెర్రిని చూసిన జనాలు వణికిపోతున్నారు. @official_shahil_khan_11111 అనే వినియోగదారు సోషల్ మీడియా సైట్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేసారు.

ఇవి కూడా చదవండి

హెల్మెట్ లోపల ఇలాంటి క్రిమి కీటకాలు దూరటం సహజం అంటున్నారు. హడావుడిగా తలకు హెల్మెట్ పెట్టుకునే ఇలాంటి ఘటనలతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందిస్తున్నారు. జెర్రి కాటు ప్రాణాంతకం కాదన్నది నిజం. అయితే, హెల్మెట్‌లో దూరినప్పుడు అది చెవిలోకి వెళితే మాత్రం ప్రమాదం తప్పదు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..