రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం 8లో 2 సూట్‌కేసులు.. బిత్తరచూపులు చూసిన నలుగురు.. కట్ చేస్తే..

అది విశాఖపట్నం రైల్వే స్టేషన్.. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.. వందలాదిమంది రైళ్లు గమ్యస్థానాలకు వెళుతుంటాయి.. ఈ క్రమంలో ఒక్కసారిగా అలజడి రేగింది.. ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫామ్‌లో బూట్ల చెప్పులు మారుమోగాయి.. కలకలం మొదలైంది.. ఓ చోట రైల్వే పోలీసులంతా ఆగారు.. అక్కడ రెండు సూట్ కేసులు..

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం 8లో 2 సూట్‌కేసులు.. బిత్తరచూపులు చూసిన నలుగురు.. కట్ చేస్తే..
Visakhapatnam railway station
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 09, 2024 | 7:01 PM

అది విశాఖపట్నం రైల్వే స్టేషన్.. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.. వందలాదిమంది రైళ్లు గమ్యస్థానాలకు వెళుతుంటాయి.. ఈ క్రమంలో ఒక్కసారిగా అలజడి రేగింది.. ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫామ్‌లో బూట్ల చెప్పులు మారుమోగాయి.. కలకలం మొదలైంది.. ఓ చోట రైల్వే పోలీసులంతా ఆగారు.. అక్కడ రెండు సూట్ కేసులు.. మరో రెండు బ్యాగులతో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతుంది.. పొంతనలేని సమాధానం జీఆర్పీ పోలీసులకు వినిపించాయి.. వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు.. అందరినీ అదుపులోకి తీసుకుని తరలించారు.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా షాకయ్యారు.. వాళ్లు ప్రయాణికులు కాదు.. ప్రయాణికుల ముసుగులో గంజాయ్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది..

ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌లో భాగంగా విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ బి.మోహనరావు సూచనలతో విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సిహెచ్ ధనుంజయ నాయుడు, RPF/IPF కే రామకృష్ణ ఉమ్మడి ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్, ప్లాట్ ఫారం-8 లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నలుగురు అనుమానస్పదంగా కనిపించారు. వారంతా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. వారిలో జితేందర్ మమన్ రామ్, జితేందర్ S/o దారియా సింగ్, దీపక్, రాజ్ కుమార్ వ్యక్తులు ఉన్నారు. ప్రశ్నిస్తే జైపూర్ నుంచి వస్తున్నట్టు చెప్పారు.

ఆరా తీస్తే.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా హర్యానాకు వెళ్తున్నట్లు తేలింది.. మళ్లీ పోలీసులకు ఏదో అనుమానం వచ్చింది.. వాళ్ల వెంట ఉన్న లగేజ్ ని చెక్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు అంతా షాకయ్యారు.. ఎందుకంటే ఆ బ్యాగులు సూట్ కేసుల్లో ఉన్నది లగేజ్ కాదు.. కిక్ ఎక్కించే గంజాయి లభ్యమైంది.. అక్షరాల 15.8 లక్షల విలువైన 31.6 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఈ నలుగురు ఒడిస్సా జైపూర్ నుంచి హర్యానాకు వయా విశాఖ మీదుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..