US Waterfall: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి.. అసలేం జరిగిందంటే!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్‌, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంది. 2023 జనవరిలో ఆమె సోదరుడు గద్దే సాయిసూర్య అవినాష్‌ (26) ఉన్నత చదువుల (ఎంఎస్‌) కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోనే అక్క ఇంటి వద్ద ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. అయితే జులూ 7న అవినాష్‌, తన అక్క కుటుంబ సభ్యులతో కలసి..

US Waterfall: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి.. అసలేం జరిగిందంటే!
Gadde Saisurya Avinash
Follow us

|

Updated on: Jul 09, 2024 | 9:01 AM

దేవరపల్లి, జులై 9: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధి ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం (జులై 8) చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్‌, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంది. 2023 జనవరిలో ఆమె సోదరుడు గద్దే సాయిసూర్య అవినాష్‌ (26) ఉన్నత చదువుల (ఎంఎస్‌) కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలోనే అక్క ఇంటి వద్ద ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. అయితే జులూ 7న అవినాష్‌, తన అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇరు కుటుంబాలకు చెందిన వారు సమీపంలోని జలపాతాలు చూసేందుకు వెళ్లారు. అక్కడ సాయిసూర్య అవినాష్‌ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడిపోయాడు. అనంతరం నీట మునిగి మృతి చెందాడు. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగివస్తాడనుకున్న తమ బిడ్డ వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏపీలోని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అవినాష్‌ మృతదేహాన్ని వీలైనంత త్వరలోనే స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికాలోని మృతుడి అక్క తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.