ఎమ్మార్వో పై ఫైర్ అయిన సర్పంచ్

తహసీల్దార్ ఆఫీస్ లో ఓ సర్పంచ్ చిందులేశాడు. పట్టాపాస్ బుక్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ రెవెన్యూ అధికారిపై వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ ఎమ్మార్వో జరిగింది. తన భూమికి పట్టాపాస్ బుక్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, ఎందుకని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు సర్పంచ్. నెక్కొండ మండలం వాగ్యనాయక్ తండాకి చెందిన సర్పంచ్ హరికిషన్ తనకున్న ఎకరం భూమికి పట్టా ఇవ్వకుండా రెవెన్యూ అధికారి రమేష్ జాప్యం చేస్తున్నాడని ఆరోపించారు. […]

ఎమ్మార్వో పై ఫైర్ అయిన సర్పంచ్

తహసీల్దార్ ఆఫీస్ లో ఓ సర్పంచ్ చిందులేశాడు. పట్టాపాస్ బుక్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ రెవెన్యూ అధికారిపై వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ ఎమ్మార్వో జరిగింది. తన భూమికి పట్టాపాస్ బుక్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, ఎందుకని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు సర్పంచ్. నెక్కొండ మండలం వాగ్యనాయక్ తండాకి చెందిన సర్పంచ్ హరికిషన్ తనకున్న ఎకరం భూమికి పట్టా ఇవ్వకుండా రెవెన్యూ అధికారి రమేష్ జాప్యం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో ఇద్దరు మధ్యా మాటల యుద్ధం జరిగింది. కాగా.. సర్పంచ్ భూమి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగానే తాను పాస్ బుక్ ఇవ్వటంలేదని తహసీల్దార్ అంటున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu