AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. కోస్తా ఆంధ్ర, యానంలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. అయితే, రాయలసీమలో 42-44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే.. తెలంగాణలో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Report: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2026 | 3:10 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నాయి.. దీంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి/గాలి అంతరాయం ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :

శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-

శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న విదర్భ నుండి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తరా అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్నాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

తెలంగాణ రాష్ట్రంలో శనివారం, ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి