AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: మాయ లేదు.. మంత్రం లేదు.. తేనెటీగలు ఆయన్ను కుట్టవు!

మాయ లేదు.. మంత్రం లేదు.. తంత్రం అంతకంటే లేదు.. అయినా ఆ తేనెటీగలు అతడిని కుట్టవు! వేల సంఖ్యలో ఉండే తేనెటీగల మధ్య ఆ యువకుడు హాయిగా ఆటలాడుతుంటాడు. ఆధునిక సమాజంలో నమ్మలేని ఈ ఆశ్చర్యకర దృశ్యం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైరల్ అవుతోంది. ఇంతకు అతన్ని తేనెటీగలు ఎందుకు కుక్కట్లేదో తెలుసుకుందాం పదండి.

Andhra News: మాయ లేదు.. మంత్రం లేదు.. తేనెటీగలు ఆయన్ను కుట్టవు!
Nellore Honey Man
Ch Murali
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 12:30 PM

Share

ఆమడ దూరంలో తేనె తెట్టే కనిపిస్తే జనాలు అటు వైపు వెళ్లడమే మానేస్తారు.. ఎందుకంటే అది ఎక్కడ కదిలి దానిపై ఉన్న తేనెటి టీగలు తమను కాటేస్తాయో అని. కానీ ఇక్కడో యువకుడు మాత్రం ఆ తేనెటీగల మధ్యనే ఆడుకుంటున్నాడు.. తెట్టెలను అమాంతం చేత్తో పట్టేసుకుంటున్నాడు. కానీ ఆ తేనెటీగలు మాత్రం అతన్ని అస్సలు కుట్టట్లేదు. ఈ ఆశ్చర్యకర ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ​నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరిపల్లికి చెందిన షేక్ ఖాజా రియాజ్ అనే యువకుడు ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారాడు.

ఒక్క తేనెటీగ కుట్టినా ఆ నొప్పి భరించడం కష్టం. కానీ, రియాజ్ మాత్రం ఎటువంటి భయం లేకుండా, కనీస రక్షణ లేకుండా ఆ తేనెటీగల సమూహం మధ్యకు వెళ్తున్నాడు. వాటిని తన చేతులతోనే నిమురుతూ, ఒంటిపైకి ఎక్కించుకుంటూ ప్రకృతితో వింతైన బంధాన్ని సాగిస్తున్నాడు. ​తన దగ్గర ఎలాంటి మాయలు లేవని, ఇది దేవుడు ఇచ్చిన వరమని రియాజ్ గట్టిగా నమ్ముతున్నాడు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న ఈ అపూర్వ అనుబంధాన్ని చూసి గ్రామస్థులు సైతం విస్తుపోతున్నారు. రియాజ్ ధైర్యాన్ని, ఆ తేనెటీగలతో అతడికి ఉన్న స్నేహాన్ని చూసి దాసరిపల్లి గ్రామస్తులందరూ అతడిని ప్రేమగా ‘హనీ మెన్’ అని పిలుచుకుంటున్నారు.

​రియాజ్ సరదాగా తీసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది ప్రకృతి వింతేనా లేక రియాజ్ కి ఉన్న ప్రత్యేక శక్తా అన్నది పక్కన పెడితే.. నెల్లూరు ‘హనీ మెన్’ సాహస కృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us