AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే

ఆ భార్య భర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. నలుగురికి న్యాయం చేయాల్సిన పోస్ట్‌లలో ఉండి.. మతితప్పి ప్రవర్తించారు. వరుసకు కూతురు అవుతుందని కూడా చూడకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది తెలిసి భర్తకు బుద్ది చెప్పాల్సిన భార్య సైతం అతనికి సహకరిస్తూ వత్తాసు పలికింది. కానీ చివరకు ఆ తప్పే వారి పాలిట శాపమై ఇద్దరూ కటకటాల పాలయ్యేందుకు కారణమైంది.

భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తే
Tirupati Pocso
Raju M P R
| Edited By: |

Updated on: May 23, 2026 | 1:04 PM

Share

తిరుపతి నగరంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం సంచలనంగా మారింది. ఈ మేరకు ఈస్ట్ పీఎస్ లో నమోదైన పోక్సో కేసు సంచలన విషయాలను బయటపెట్టింది. వరుసకు కూతురైన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన రామ్మూర్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే రామ్మూర్తి GST కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య రైల్వే కోడూరు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తోంది.

అయితే రామ్మూర్తి భార్యకు ఒక అక్క ఉంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటుండగా ఆమె కూతురు అక్కడే చదువుకుంటోంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో బాలిక లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి వచ్చింది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. భార్య అక్క కూతురైన బాలికపై కన్నేసిన రామ్మూర్తి.. ఆ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ప్రవర్తణలో మార్పు రావడం గమనించి ఆమె తల్లి ఏమైందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే బాలిక తల్లి తన చెల్లి భర్తపై సైబరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై జీరో FIR నమోదు చేసి దాని తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఇక అక్కడ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు నిందితుడిని రామ్మూర్తిని అదుపులోకి తీసుకొని అతనిపై 64(2)(f) 64(2)(m) BNS 5(1) 5(n) r/w 6 ఫోక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేసారు.

అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సోషల్ మీడియాలో తన న్యూడ్ ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించి రామ్మూర్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే కేసు నుంచి తప్పించేందుకు భర్తకు రామ్మూర్తి భార్య మానస కూడా సహకరించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో గత నెల 28న ఈ కేసు నమోదు కాగా తాజాగా భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వేధింపులను భరించవద్దు వెంటనే సమాచారం ఇవ్వండి.

ఈ ఘటన నేపథ్యంలో పేరెంట్స్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. మైనర్ల పై జరిగే లైంగిక వేధింపులు, బెదిరింపులు లాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాచి పెట్టవద్దని పోలీసులు కోరుతున్నారు. అలాంటి సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా, చాట్ యాప్స్ ద్వారా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులకు, లేదంటే పోలీసులకు తెలపాలని ఎస్పీ చెప్పారు. మైనర్ల రక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని, బాధితుల వివరాల విషయంలో గోప్యతను పాటిస్తామని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us