AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన హీరో రోహిత్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన శిరీష..

గతేడాది అక్టోబర్ 30న బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు నారా రోహిత్. హీరోయిన్ శిరీషను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. దీంతో ఈజంటకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన హీరో రోహిత్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన శిరీష..
Nara Rohit, Sirisha
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2026 | 2:58 PM

Share

నారా వారి ఇంట పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీంతో నారా రోహిత్, శిరీష దంపతులకు అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది అక్టోబర్ 30న నారా రోహిత్, శిరీష పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతుల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టాడు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

ఇదిలా ఉంటే..’ప్రతినిధి 2′ చిత్రంలో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. శిరీషకు ఇది మొదటి సినిమా. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకోగా, ఆ తర్వాత ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు వారసుడి రాకతో నారా రోహిత్ ఇంట ఆనంద క్షణాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

నారా రోహిత్ సినీ ప్రయాణం..

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు నారా రోహిత్. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకునే నటుడిగా నారా రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల ‘సుందరకాండ’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిజం, భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు నారా రోహిత్ . ప్రస్తుతం ఆయన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి