వానాకాలం మీ వాటర్ ట్యాంక్‌లో నీరు నీచువాసన వస్తోందా..? ఇలా చేస్తే సమస్యకు చెక్!
వానాకాలం వచ్చేసింది.. వర్షాలు పడుతున్నాయి. సీజన్ మొదలవగానే వాతావరణం చల్లబడుతుంది. కానీ, ఇదే సమయంలో ఇంటి నీటి ట్యాంకుల్లో సమస్యలు మొదలవుతాయి. తరచూ వర్షాలు పడటం, ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల ట్యాంక్‌లో తేమ పెరిగి నాచు, బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ట్యాంక్ నీరు ఒక రకమైన కుళ్లిన వాసన లేదా చేపల వాసన రావడం మొదలవుతుంది. ఈ నీటితో స్నానం చేసినా, గిన్నెలు కడిగినా ఆరోగ్యానికి హానికరం. అయితే, ప్లంబర్ సహాయం లేకుండానే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం:

వర్షాకాలంలో తేమ, సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఇంటి పైకప్పుపై ఉండే వాటర్ ట్యాంకుల్లో నాచు, బ్యాక్టీరియా చేరి నీరు చేపల వాసన లేదా కుళ్లిన వాసన వస్తుంటుంది. ఈ కలుషిత నీటిని వాడటం వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ట్యాంక్ లోపలికి దిగకుండానే ఇంట్లోనే ఉండే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో ఈ దుర్వాసనను సులభంగా పోగొట్టవచ్చు. బేకింగ్ సోడా, ఫిట్కిరీ (ఆలమ్), బ్లీచింగ్ పౌడర్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వంటింటి చిట్కాలను ఉపయోగించి ట్యాంక్‌ను ఎలా శుభ్రం చేయాలో, నీటిని ఎలా స్వచ్ఛంగా మార్చుకోవాలో వివరంగా తెలుసుకోండి.
బేకింగ్ సోడా, డిటర్జెంట్:
ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత, కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌లో బేకింగ్ సోడా కలపండి. బేకింగ్ సోడా సహజమైన డియోడరైజర్‌గా పనిచేసి దుర్వాసనను పూర్తిగా పీల్చేస్తుంది. ఒక పొడవైన వైపర్ లేదా బ్రష్‌కు గుడ్డను చుట్టి, ఈ మిశ్రమంతో ట్యాంక్ గోడలను, అడుగు భాగాన్ని బాగా రుద్ది, ఆపై శుభ్రమైన నీటితో కడిగేయాలి.
ఫిట్కిరీ (Alum – పటిక) ట్రిక్: నీటిలోని మురికిని అడుగుకు చేర్చడంలో, బ్యాక్టీరియాను చంపడంలో పటిక అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బకెట్ నీటిలో ఫిట్కిరీ పౌడర్ కలిపి ఆ ద్రావణాన్ని ట్యాంక్ గోడలపై చల్లాలి. లేదా చిన్న పటిక ముక్కను తెల్లటి కాటన్ బట్టలో కట్టి ట్యాంక్ నీటిలో వేలాడదీసినా నీరు స్వచ్ఛంగా మారి వాసన తగ్గుతుంది.
బ్లీచింగ్ పౌడర్: క్రిములను, దుర్వాసనను వదిలించడానికి బ్లీచింగ్ పౌడర్ అత్యంత ప్రభావవంతమైన మార్గం. ట్యాంక్ పరిమాణాన్ని బట్టి తగినంత బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కలిపి ట్యాంక్ గోడలపై చల్లాలి. ఒక గంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత మంచి నీటితో క్లీన్ చేయాలి. ఇది ట్యాంక్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్: ట్యాంక్‌లో జిడ్డు, కఠినమైన నాచు పేరుకుపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడవచ్చు. ట్యాంక్ ఖాళీ చేసి దీనిని చల్లడం వల్ల నాచు క్షణాల్లో వదిలిపోతుంది. ఆ తర్వాత నీటితో కడిగితే ట్యాంక్ కొత్తదానిలా మెరుస్తుంది.
వర్షాకాలంలో వాటర్ ట్యాంక్ మూత ఎల్లప్పుడూ గట్టిగా మూసి ఉంచాలి. వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. కనీసం రెండు లేదా మూడు నెలలకోసారి ఈ చిట్కాలతో ట్యాంక్ శుభ్రం చేసుకుంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.




