AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

రహదారి పక్కన భూమి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అదరిపోయే గుడ్‌ న్యూస్ చెప్పింది. ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాధించే ఛాన్స్‌ కల్పిస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, TGREDCO రాష్ట్రవ్యాప్తంగా 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూస్వాముల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?
Telangana Ev Charging
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 4:03 PM

Share

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (TGREDCO) భూస్వాములు, వాణిజ్య సంస్థల నుంచి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానిస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న ప్రదేశాల్లో ఈ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తూ, హైదరాబాద్‌తో పాటు వరంగల్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ వంటి కీలక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్ వెలుపల ప్రాంతాల్లో ప్రస్తుతం ఛార్జింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్టుకు మంచి స్పందన లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ సదుపాయాలు భవిష్యత్తులో మరింత అవసరమవుతాయని వారు చెబుతున్నారు.

ఈ పథకానికి ఎవరు అర్హులు

ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 200 చదరపు గజాల స్థలం ఉండాలి. అది కూడా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో, మార్కెట్‌లు లేదా మాల్స్ సమీపంలో ఉంటే ఇంకా మంచిది. వీటితో పాటు ఆ ప్రాంతంలో జనాలు  24 గంటల రాకపోకలు సాగించేలా ఉండాలి, వాహనాలు పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ కనెక్షన్ కూడా తప్పనిసరి.  ఒక వేళ మీ దగ్గర ఇవన్ని ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు అని అర్థం. మీరు వెంటనే దీని కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు మౌలిక సదుపాయాల ఖర్చుపై 80 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది. దీని ద్వారా భూస్వాములకు స్థిరమైన ఆదాయ వనరు లభించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

ధరఖాస్తు కోసం ఏ పత్రాలు కావాలి?

అర్హులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి .. భూస్వామ్య పత్రాలు, గుర్తింపు ఆధారం, స్థల ఫోటోలు, లేఅవుట్ వివరాలు, విద్యుత్ కనెక్షన్ సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. మే 3 వరకు ఇందుకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అధికారుల ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు టీజీ రెడ్కో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 63049 03957, 63049 03935 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు చెబుతున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాల యుగం వైపు దూసుకెళ్తున్న తెలంగాణలో, ఈ పథకం భూమి ఉన్న వారికి ఒక మంచి ఆదాయ అవకాశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం దర్శనం.. ఇక్కడికెళ్లారంటే కష్టాల..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం దర్శనం.. ఇక్కడికెళ్లారంటే కష్టాల..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం