AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నంత పనీ చేశారు..

ప్రేమికుల రోజు జంటలుగా కనిపిస్తే.. పెళ్లిళ్లు చేస్తామంటూ హెచ్చరించిన భజరంగ్ దళ్ అన్నంతపనీ చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల్లో కనిపించిన జంటలకు పెళ్లిళ్లు చేస్తామంటూ గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇవాళ దూకుడు పెంచారు. కాగా.. మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ప్రేమజంటను అడ్డుకుని భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి జరిపించారు. ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. విదేశీ సంస్కృతి ముసుగులో యువత తప్పుడుదోవ పడుతోందంటూ […]

అన్నంత పనీ చేశారు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 15, 2019 | 1:08 PM

Share

ప్రేమికుల రోజు జంటలుగా కనిపిస్తే.. పెళ్లిళ్లు చేస్తామంటూ హెచ్చరించిన భజరంగ్ దళ్ అన్నంతపనీ చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల్లో కనిపించిన జంటలకు పెళ్లిళ్లు చేస్తామంటూ గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇవాళ దూకుడు పెంచారు. కాగా.. మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ప్రేమజంటను అడ్డుకుని భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి జరిపించారు. ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. విదేశీ సంస్కృతి ముసుగులో యువత తప్పుడుదోవ పడుతోందంటూ విమర్శించారు.

Follow Us