తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీని ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ నుంచి వ్యంగ్య ట్వీట్ వచ్చింది. "ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే, నకిలీ నకిలీనే" అంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పేరును ఎన్నికల సంఘం అనుమతించదని బీఆర్ఎస్ నేత కార్తీక్ ఇంద్రారెడ్డి అన్నారు.