AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: శ్మశానంలోని బాత్‌రూమ్‌లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా

తల్లిప్రేమకు ఈ లోకం ఏది సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ మాటలకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు తల్లులు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను పొతిళ్లలోనే కడతేర్చుతున్నారు. అభంశుభం తెలియని ఆ పసికందులను కళ్లు తెరవక ముందే చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. ముక్కపచ్చలారని 6 నెలల పిండాన్ని గుర్తతెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.

Telangana: శ్మశానంలోని బాత్‌రూమ్‌లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
Kothagudem Crime News
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 5:44 PM

Share

అరునెలల పిండాన్ని గుర్తి తెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లే.. మణుగూరు మండలం గుట్ట మల్లారం స్మశాన వాటికలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అభం శుభం తెలియని ఆరు నెలల పిండాన్ని వదిలేసి వెళ్లారు. అయితే వైకుంఠదామంలో కాపలా ఉండే కాటికాపరి ఉదయం వచ్చి బాత్రూం ఓపెన్ చేయగా అక్కడ అతినికి ఓ కవర్ కనిపించింది. ఆ కవర్ ఏంటా అని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ మృత శిశువు కనిపించింది.

రక్తపు ముద్దలా ఉన్న శిశువును చూసిన కాటికాపరి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకెళ్లాడు. అనంరతం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిడ్డను ఎవరు వదిలేసి పోయారు తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొక్క కర్ణాటకలో, ఇప్పుడు ఇక్కడ తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చదువుకున్న వారు, చదువులేనివారు అనే తేడా లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకు వచ్చి వందేళ్లు బతకాల్సిన ఆ పసికందుల జీవితాలను నెలలు నిండకుండానే చిదిమేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us