AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్రభాస్, రవితేజతో బ్లాక్ బస్టర్స్.. 3 భాషలలో 9 సినిమాలతో ఇండస్ట్రీలో సంచలనం.. 27 ఏళ్లకే సినిమాలకు దూరం..

నటిగా సినీరంగంలోకి తెరంగేట్రం చేసి ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ హీరోయిన్. కేవలం నాలుగేళ్ల సినీ ప్రయాణంలో దాదాపు మూడు భాషలలో 9 సినిమాలు చేశారు. దక్షిణాదిలో ఆమె అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. కానీ ఊహించని విధంగా.. కెరీర్ మంచి మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. అప్పుడు ఆమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.

Tollywood : ప్రభాస్, రవితేజతో బ్లాక్ బస్టర్స్.. 3 భాషలలో 9 సినిమాలతో ఇండస్ట్రీలో సంచలనం.. 27 ఏళ్లకే సినిమాలకు దూరం..
Richa Gangopadhyay
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2026 | 5:03 PM

Share

సినీరంగంలో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. కొన్నాళ్ల క్రితం తెలుగు కుర్రాళ్ల కలల రాణి ఆమె. రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఫాంలో ఉండగానే 27 ఏళ్ల వయసులో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని తల్లిగా, భార్యగా తన లైఫ్ గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. చాలా తక్కువ సమయంలోనే ఒక అరుదైన ఘనతను సాధించారు. 2010 నుండి 2013 మధ్య, ఆమె తెలుగు, తమిళ, బెంగాలీ భాషలలో తొమ్మిది చిత్రాలలో నటించారు. అంతేకాకుండా వెంకటేష్, నాగార్జున, రవి తేజ, ప్రభాస్, రానా దగ్గుబాటి, ధనుష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

తన కెరీర్‌లో ఆమె ఆరు ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. ఆ తర్వాత, చాలా మంది నటీమణులు ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే అంటే కేవలం 27 ఏళ్ల వయసులోనే సినిమాలకు దూరమయ్యారు. అందుకు కారణం ఆమె మార్కెటింగ్ చదవాలనుకోవడమే. రిచా మిచిగాన్‌లో పెరిగింది. అక్కడ, 2007లో న్యూజెర్సీలో జరిగిన 26వ వార్షిక అందాల పోటీలో ఆమె మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ను గెలుచుకుంది. అదే సంవత్సరంలో మిస్ మిచిగాన్, మిస్ కంజీనియాలిటీ, మిస్ ఫోటోజెనిక్ టైటిళ్లను కూడా కైవసం చేసుకుంది. 2008లో, ఆమె ముంబైకి వెళ్లి , అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ ‘యాక్టర్ ప్రిపేర్స్’లో చేరింది. రెండేళ్లలోపే రానా నటించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

ఆ తర్వాత వెంకటేశ్ నటించిన నాగవల్లి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. రవితేజ జోడిగా మిరపకాయ్ సినిమాలో నటించింది. ప్రభాస్, అనుష్క కలిసి నటించిన మిర్చి సినిమాతో రిచా కెరీర్ మారిపోయింది. ఈ మూవీతో తెలుగులో విపరతీమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కేవలం నాలుగేళ్ల సినీ ప్రయాణంలో మూడు భాషలలో మొత్తం సినిమాలు చేసింది. 2013 అక్టోబర్‌లో, ఆమె తన MBAను చదవడానికి సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన మాజీ US ఆర్మీ అధికారి అయిన తన భర్త జో లాంగెల్లాను కలిసింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. వారికి మే 2021లో ఒక కుమారుడు జన్మించాడు.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

Richa Gangopadhyay Movies

Richa Gangopadhyay Movies

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

Follow Us