ఆర్టీసీ బస్సు బోల్తా: 22 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా: 22 మందికి గాయాలు

నల్గొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేములపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. బస్సును మార్గ మధ్యలో ఆపి డ్రైవర్ మద్యం సేవించాడని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. అయితే.. కుడివైపు వస్తున్న […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 15, 2019 | 1:05 PM

నల్గొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేములపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. బస్సును మార్గ మధ్యలో ఆపి డ్రైవర్ మద్యం సేవించాడని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. అయితే.. కుడివైపు వస్తున్న వాహనాన్ని తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu