AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ ప్రియులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించిన సర్పంచ్

చికెన్ అంటే చోలు.. నాన్ వెజ్ ప్రియులకు పండగే. లొట్టలేసుకుని మరీ తింటారు. ఇక ఈ చికెన్ ధర ఎక్కువ ఉన్న సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు షాపు యజమానులు అనేక ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కస్టమర్లు కూడా ఆ ఆఫర్లకు ఆకర్షితులై వెళ్తుంటారు. అయితే కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ సర్పంచ్ చికెన్ ప్రియులకు ఓ పంబర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ధర పెరిగినందుకో.. లేక ఆయనదే షాపు ఉందో అని కాదు.. […]

చికెన్‌ ప్రియులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించిన సర్పంచ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 7:31 AM

Share

చికెన్ అంటే చోలు.. నాన్ వెజ్ ప్రియులకు పండగే. లొట్టలేసుకుని మరీ తింటారు. ఇక ఈ చికెన్ ధర ఎక్కువ ఉన్న సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు షాపు యజమానులు అనేక ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కస్టమర్లు కూడా ఆ ఆఫర్లకు ఆకర్షితులై వెళ్తుంటారు. అయితే కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ సర్పంచ్ చికెన్ ప్రియులకు ఓ పంబర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ధర పెరిగినందుకో.. లేక ఆయనదే షాపు ఉందో అని కాదు.. ప్రజల్లో స్వచ్చ్ భారత్‌, ప్లాస్టిక్ రహిత భారత్‌పై అవగాహన రావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. అందుకోసం ఆ సర్పంచ్ ఓ సరికొత్త రూట్‌ ఎంచుకున్నారు.

ప్లాస్టిక్ వినయోగం తగ్గించాలని.. అదే సమయంలో ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కోసం ఉపయోగించాలని ప్రభుత్వాలు సూచిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల ప్లాస్టిక్ రికవరీ కోసం వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్లాస్టిక్ తీసుకొస్తే.. కిలో బియ్యం ఇస్తామని.. మరికొన్ని చోట్ల కిలో ప్లాస్టిక్ ఇస్తే పాల ప్యాకిట్లు ఇష్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ మాత్రం వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు. కిలో ప్లాస్టిక్‌కు ఒక కిలో చికెన్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి రెండో విడుత కార్యక్రమం ముగింపు సందర్భంగా.. జిల్లాకు చెందిన లస్మన్నపల్లిలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ ఈ ప్లాస్టిక్-చికెన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ ప్రకటించిన కొద్ది సేపటికే.. దాదాపు పది కిలోల ప్లాస్టిక్ తీసుకొచ్చారట ప్రజలు.