అమరావతికి మహిళా కమిషన్ సభ్యులు.. పోలీసులపై మహిళల ఫిర్యాదు

జాతీయ మహిళా కమిషన్ సభ్యులు అమరావతిలో పర్యటిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తోన్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మహిళా కమిషన్ సభ్యులను కలిశారు. మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన వారికి ఫిర్యాదు చేశారు. అమరావతి విషయమై రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారో గల్లా మహిళా కమిషన్ సభ్యులకు వెల్లడించారు. మరోవైపు మహిళలపై […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:57 pm, Sun, 12 January 20
అమరావతికి మహిళా కమిషన్ సభ్యులు.. పోలీసులపై మహిళల ఫిర్యాదు

జాతీయ మహిళా కమిషన్ సభ్యులు అమరావతిలో పర్యటిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తోన్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మహిళా కమిషన్ సభ్యులను కలిశారు. మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన వారికి ఫిర్యాదు చేశారు. అమరావతి విషయమై రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారో గల్లా మహిళా కమిషన్ సభ్యులకు వెల్లడించారు.

మరోవైపు మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనల ఆరోపణలపై.. తుళ్లూరు తహసీల్దార్‌, డీఎస్పీతో మహిళా కమిషన్ సభ్యులు మాట్లాడారు. వాటికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. తుళ్లూరు చేరుకునే క్రమంలో.. మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ మహిళలతో మాట్లాడగా.. పోలీసులు తమను ఇబ్బంది పెట్టారని వారు తెలిపారు. ఇదిలా ఉంటే మహిళా పోలీసులపై కూడా కొందరు దాడులు చేశార‌ని ఏపీ పోలీస్ సంఘం.. మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యా‌దు చేసింది.