AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌ను దించేందుకు త్వరలో యాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు త్వరలో యాగం చేస్తానన్నారు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ పతనం చూడటమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి శనివారం నాడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లికి టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోత్కుపల్లి… కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, […]

కేసీఆర్‌ను దించేందుకు త్వరలో యాగం
Rajesh Sharma
|

Updated on: Jan 11, 2020 | 5:55 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు త్వరలో యాగం చేస్తానన్నారు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ పతనం చూడటమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి శనివారం నాడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లికి టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా మాట్లాడిన మోత్కుపల్లి… కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి నరసింహులు.. కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నానన్నారు. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్‌ను దించేయటానికి ప్రత్యేక యాగం చేస్తానన్నారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్‌ను ఎనిమిదో నిజాంతో పోల్చిన మోత్కుపల్లి.. ఆయన హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బ్రతికే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

కేసీఆర్ దగ్గరకు ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడికి తప్ప ఎవరికీ ప్రవేశం లేదని విమర్శించారు. తెలంగాణలో దళితుల అభివృద్ధే తనకు ముఖ్యమన్న మోత్కుపల్లి.. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు.

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?