Andhra: వీటిని కుందేళ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏంటో తెలిస్తే బిత్తరపోతారు
చూడ్డానికి కుందేళ్ళులా కనిపిస్తాయి. దగ్గరకు వెళ్ళి చూస్తే అవి ఎలుకలు. చిన్నగా ముద్దుగా ఉండే ఈ ఎలుకలను చూడాలంటే పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు వెళ్ళాల్సిందే. కుందేళ్ళులా కనిపించే ఎలుకలు ఈ ప్రాంతంలో కనిపించవు. అరుదుగా కనిపించే వీటిని కాశీ ఎలుకలు అంటారు.

సాధారణంగా నలుపు, బూడిద రంగులో ఉండే ఎలుకలు మనకు తెలుసు. అప్పుడప్పుడూ తెలుపు రంగు ఎలుకలను కూడా చూసి ఉంటారు. అలాగే ఎలుకలకు పెద్ద తోక కూడా ఉంటుంది ఇదికూడా తెలుసు… అదిసరే, ఇప్పుడు ఈ ఎలుక పురాణం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. ఇప్పడు మీకు ఓ కొత్తరకం ఎలుకలను పరిచయం చేయబోతున్నాం. కుందేళ్లులా ఉండటం వీటి ప్రత్యేకత… అంతేకాదు వీటికి తోక కూడా ఉండదు. చూడ్డానికి రంగురంగుల కుందేళ్ళులా కనిపిస్తాయి… కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే కానీ అవి ఎలుకలని ఎవరికీ తెలియదు. చిన్నగా ముద్దుగా ఉండే ఈ ఎలుకలను చూడాలంటే పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు వెళ్ళాల్సిందే. కుందేళ్ళులా కనిపించే ఎలుకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని కాశీ ఎలుకలు అని కూడా అంటారు. పాలకోడేరు మండలం మోగల్లు గోస్తనీ వద్ద ఉన్న మహావనంలో డాక్టర్ గాదిరాజు కృష్ణంరాజు ఈ కాశీ ఎలుకలను ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు.
మనం తెలుగులో కాశీ ఎలుకలు అని పిలిచే వీటిని గునియా పిగ్స్ , గిన్ని పిగ్స్ అంటారు. ఇవి దక్షిణాఫ్రికా కు చెందిన జంతువులు. రంగురంగుల బొచ్చుతో పోడవుగా, తోకలు లేకుండా అందంగా ఉంటాయి. ఇవి గడ్డి, మూలికలు, తీగలను ఆహారంగా తీసుకుంటాయి. మనుషులతో కలిసిపోయి స్నేహపూర్వకంగా ఉంటాయి. 600 గ్రాముల బరువు వరుకూ పెరుగుతాయి. 8 నుండి 10 సంవత్సరాల వరకూ జీవిస్తాయి. కృష్ణంరాజు వీటిని హైద్రాబాద్ నుండి తీసుకుని వచ్చి ప్రత్యక శ్రద్ధతో పెంచుతున్నారు. ప్రకృతిలో మనతో పాటు ఇతర స్నేహపూర్వకంగా ఉండే జంతువులు ఉన్నాయని వాటిని పెంచడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని కృష్ణంరాజు అంటున్నారు. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడుతున్నారని, వీటితో ఆడుకుంటున్నారని చెబుతున్నారు. పూర్వం ఈ ఎలుకలను సర్కస్ లో చూసేవాళ్ళం అని, ఇప్పుడు తాను స్వయంగా కాశీ ఎలుకలను పెంచడం చాలా సంతోషంగా ఉందని బాబు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చేయండి








