AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : భైంసాలో ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు..

నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న వివాదం కాస్త.. చిలికి చిలికి ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఆదివారం సాయంత్రం.. పట్టణంలోని ఓ వీధి గుండా ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా.. కొందరు యువకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదలైన మాట-మాట.. పెద్ద గొడవగా మారింది. అనంతరం ఇరు వర్గాలుగా విడిపోయి రాళ్లతో రువ్వకుంటూ.. కర్రలతో కొట్టుకున్నారు. ఆవేశంతో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగప్రవేశం […]

బ్రేకింగ్ : భైంసాలో ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 10:33 AM

Share

నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న వివాదం కాస్త.. చిలికి చిలికి ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఆదివారం సాయంత్రం.. పట్టణంలోని ఓ వీధి గుండా ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా.. కొందరు యువకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదలైన మాట-మాట.. పెద్ద గొడవగా మారింది. అనంతరం ఇరు వర్గాలుగా విడిపోయి రాళ్లతో రువ్వకుంటూ.. కర్రలతో కొట్టుకున్నారు. ఆవేశంతో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు.

అయితే ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో.. రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహ్మారావు, సీఐ వేణుగోపాల రావు, ముథోల్ ఎస్‌ఐ అశోక్‌లతో పాటు పలువురు కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. ప్రస్తుతం భైంసా పట్టణంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. శాంతి భద్రతలను విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు పర్యటించారు. ఘర్షణ తలెత్తడానికి గల కారణాలను.. స్థానికలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్తినష్టం జరిగిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని.. శాంతి భద్రతల పరిరక్షణకు.. ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ఎస్పీ ప్రజలను కోరారు.

Follow Us