AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి వేడుకలో చికెన్ కర్రీ చిచ్చు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న బంధువులు.. అసలు మ్యాటరేంటంటే..

పెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లి సందర్భంగా ఒక అతిథిపై అనుకోకుండా చికెన్ కర్రీ పడటంతో మొదలైన గొడవ.. చూస్తుండగా హింసాత్మక ఘర్షణకు దారి తీసింది.. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. ఆరుగురికి గాయాలయ్యాయి.. వేడుకగా జరగాల్సిన వివాహం.. కాస్త.. అనుకోని ఘటనతో దిగ్భ్రాంతికరంగా ముగిసింది.

పెళ్లి వేడుకలో చికెన్ కర్రీ చిచ్చు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న బంధువులు.. అసలు మ్యాటరేంటంటే..
Chicken Curry
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2026 | 2:59 PM

Share

చికెన్ కర్రీ.. కూర ఎంత కమ్మగా ఉంటుందో.. అంతే గొడవలకు కూడా కారణమవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. తాజాగా.. చికెన్ కర్రీ.. ఒకరి ప్రాణాలు తీయగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. అనుకోకుండా ఓ వ్యక్తిపై చికెన్ కర్రీ పడటంతో గొడవ మొదలైంది.. అది కాస్త.. ఘర్షణగా మారి ఒకరి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది.. ఒలికిపోయిన చికెన్ కర్రీ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ గొడవలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

గోరఖ్‌పూర్‌ ప్రాంతంలోని సౌరియా అనే గ్రామంలో ఒక వివాహ విందు జరుగుతుండగా ఈ గొడవ మొదలైంది. విందు వడ్డిస్తున్న సమయంలో కొంత చికెన్ కర్రీ ఒక వ్యక్తిపై లేదా కింద వలికినట్లు సమాచారం. ఈ విషయమై అతిథుల మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ హింసాత్మక ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడిలో గాయపడిన మిగిలిన ఆరుగురిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడిని పెళ్లికొడుకు బృందంలో ఉన్న సుమిత్ కుమార్‌గా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాహ వేడుకలో జరిగిన ఈ హింసపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్రామంలో మళ్లీ గొడవలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించడానికి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కేవలం చిన్నపాటి కారణానికే ప్రాణాలు తీసే స్థాయికి గొడవ వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఫ్రిజ్‌లో కూరగాయల పక్కన స్పాంజ్ పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఫ్రిజ్‌లో కూరగాయల పక్కన స్పాంజ్ పెడితే ఏమవుతుందో తెలుసా..?