AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians: ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేషన్.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురిని ఛీ కొట్టనున్న ముంబై ఇండియన్స్..?

Mumbai Indians Released Players 2027: ఈ టోర్నమెంట్ అంతటా ముంబై ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత, ఫ్రాంచైజీ టీంను సరికొత్తగా నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ముగ్గురు కీలక ఆటగాళ్లను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది.

Mumbai Indians: ఐపీఎల్ 2026 నుంచి ఎలిమినేషన్.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురిని ఛీ కొట్టనున్న ముంబై ఇండియన్స్..?
Mumbai Indians Released Players 2027
Venkata Chari
|

Updated on: May 11, 2026 | 6:38 PM

Share

Mumbai Indians Released Players 2027: కాగితంపై చూస్తే, ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలుచుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫేవరెట్‌గా నిలిచింది. జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొందరు ఇటీవల టీ20 ప్రపంచ కప్‌ను కూడా గెలుచుకున్నారు. అయితే, పరిస్థితి తలకిందులైంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తర్వాత టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా ముంబై నిలిచింది. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా, బౌలర్లు నిలకడగా వికెట్లు తీయలేకపోయారు. దీని ఫలితంగా, ప్రత్యర్థులు పైచేయి సాధించారు. ముంబై ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి, లీగ్ దశ ముగియడానికి రెండు వారాల ముందే టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసింది.

ఈ టోర్నమెంట్ అంతటా పలువురు ముంబై ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ దారుణమైన సీజన్ తర్వాత, ఫ్రాంచైజీ జట్టును పునర్నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. కాబట్టి, ముంబై ఇండియన్స్ వదిలిపెట్టే అవకాశం ఉన్న ఆ ముగ్గురు కీలక ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

1) సూర్యకుమార్ యాదవ్: 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వయసు పెరుగుతోంది. అతని ప్రదర్శన (T20Iలు, IPL రెండింటిలోనూ) భారీగా పడిపోయింది. ఒకప్పుడు ఫ్రాంచైజీకి స్టార్‌గా ఉన్న సూర్యకుమార్, ప్రస్తుత సీజన్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2026లో రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో, సీనియర్ బ్యాటర్‌గా సూర్య బాధ్యత తీసుకోవాల్సి ఉంది. కానీ, అతను ఒత్తిడిలో విఫలమయ్యాడు.

సూర్యకుమార్ యాదవ్ 11 మ్యాచ్‌ల్లో మొత్తంగా 195 పరుగులు చేయగా, సగటు కేవలం 17.73 కాగా, 144.44 స్ట్రైక్ రేట్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం సూర్య ఫామ్‌ను సూచిస్తోంది. ఐపీఎల్ 2027 కోసం కొత్తగా జట్టును నిర్మించాలని ముంబై భావిస్తే, యువ ఆటగాళ్ల కోసం సూర్యను విడుదల చేసే అవకాశం ఉంది.

2) హార్దిక్ పాండ్యా: 2024 ఐపీఎల్‌కు ముందు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకున్నప్పుడు చాలా అంచనాలు ఉండేవి. కానీ, నాయకుడిగా, ఆల్ రౌండర్‌గా హార్దిక్ విఫలమవ్వడంతో ఆ నిర్ణయం డిజాస్టర్‌గా మారింది. అతని కెప్టెన్సీలో 2024, 2026లో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.

8 మ్యాచ్‌‌ల్లో 146 పరుగులు చేయగా, బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 136.45కి పడిపోయింది. ఇక బౌలింగ్‌లో 11.90 ఎకానమీతో 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కెప్టెన్సీ భారం అతని వ్యక్తిగత ప్రదర్శనపై కూడా పడింది. అతని నిర్ణయాలు నిరంతరం విమర్శలకు గురవుతున్నాయి, కాబట్టి వచ్చే వేలానికి ముందు ఫ్రాంచైజీ అతన్ని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది.

3) ట్రెంట్ బౌల్ట్: ట్రెంట్ బౌల్ట్ తిరిగి రావడంతో బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను వణికిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ బౌల్ట్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో బౌల్ట్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అది కూడా 11.63 ఎకానమీతో. ఒకప్పుడు పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో దిట్ట అయిన బౌల్ట్, ఇప్పుడు తన వేగాన్ని, స్వింగ్‌ను కోల్పోయినట్లు కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us