ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన స్టీల్‌ ఉత్పత్తి సంస్థ పోస్కో వెల్లడించింది

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 30, 2020 | 9:56 AM

Posco Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన స్టీల్‌ ఉత్పత్తి సంస్థ పోస్కో వెల్లడించింది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సీఎం క్యాంపు కార్యాలయంలో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎంకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మేలు చేసేలా అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని జగన్ వారికి బదులు ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. సహజవనరుల పరంగానూ రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటు అవుతాయని ఆయన వివరించారు. జగన్‌ని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు

ఈ క్రెడిట్‌ మొత్తం నీదే: మంచు లక్ష్మికి సూర్య థ్యాంక్స్‌