ఈ క్రెడిట్‌ మొత్తం నీదే: మంచు లక్ష్మికి సూర్య థ్యాంక్స్‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రెడిట్‌ మొత్తం నీదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.

  • Manju Sandulo
  • Publish Date - 8:25 am, Fri, 30 October 20

Suriya Soorarai Potru: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రెడిట్‌ మొత్తం నీదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. సుధా కొంకర దర్శకత్వంలో సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రల్లో నటించారు. దీపావళి కానుకగా ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది.(Bigg Boss 4: మోనాల్‌పై అభిజిత్‌ బాడీ షేమింగ్ కామెంట్లు)

ఇక ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా.. దానిపై మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో స్పందించారు. ఈ మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నా. ఈ దీపావళి మరింత ప్రకాశం కానుంది అని కామెంట్లు పెట్టారు. దానికి స్పందించిన సూర్య.. ఈ మూవీని నీకు చూపేందుకు ఎదురుచూస్తున్నా. ఈ క్రెడిట్‌ మొత్తం నీదే. మోహన్‌ బాబు సర్‌ని ఈ మూవీ కోసం ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్‌. ఇది నిజంగా నాకు బ్రెస్సింగ్‌ అని ట్వీట్ చేశారు. (Bigg Boss 4: మాస్టర్‌ కక్కుర్తి.. అరియానాతో గొడవ)