నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ
వ్యవసాయంలో ఉన్నత చదువులు చదువాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాయం పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్...
NG Ranga Agricultural University : వ్యవసాయంలో ఉన్నత చదువులు చదువాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాయం పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రాతపరీక్ష, అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపికజరగనుంది. పూర్తిసమాచారం కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.in ను చూడాలని కోరింది. అయితే నూతనంగా ప్రవేశ పెట్టిన ఎమ్మెస్సీ హోంసైన్స్ కోర్సుకు మాత్రం విద్యార్థినిలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎమ్మెస్సీ హోంసైన్స్, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఎంబీఏ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్), పీహెచ్‌డీ అగ్రికల్చర్, హోంసైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులను విశ్వ విద్యాలయం ఆఫర్ చేస్తోంది.