వైజాగ్‌లో ‘పుష్ప’ షూటింగ్.. నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి బన్నీ..!
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సెట్స్ మీదకు కూడా వెళ్లారు.

Allu Arjun Pushpa: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సెట్స్ మీదకు కూడా వెళ్లారు. కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన పుష్ప మూవీని తిరిగి స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
నవంబర్ 5న వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ మూవీ షూటింగ్‌ని కేరళలో చేయాలనుకున్నప్పటికీ.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోనే పూర్తి చేసేలా సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే అల వైకుంఠపురములో తరువాత పుష్ప కోసం కసరత్తులు చేయడం, తరువాత లాక్‌డౌన్ రావడంతో కొన్ని నెలలుగా ఇంటిపట్టునే ఉన్న బన్నీ.. మొదటిసారి సెట్స్‌పైకి వెళ్లనున్నారు.(Dil Bechara: నా నవలకు జీవం పోశారు.. సంజనాకు హాలీవుడ్ రచయిత మెసేజ్)
కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక నటించనుంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, హరీష్ ఉత్తమన్, ధనుంజయ్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ-సుకుమార్ కాంబోలో మూడో మూవీగా తెరకెక్కుతున్న పుష్పపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. (యాక్షన్ కింగ్ దర్శకత్వంలో చైతూ..!)