యాక్షన్ కింగ్ దర్శకత్వంలో చైతూ..!
యాక్షన్ కింగ్ అర్జున్ మల్టీటాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. నటుడిగా వందకు పైగా చిత్రాల్లో నటించిన అర్జున్.. 12 సినిమాలకు దర్శకత్వం వహించారు

Naga Chaitanya Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ మల్టీటాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. నటుడిగా వందకు పైగా చిత్రాల్లో నటించిన అర్జున్.. 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు సింగర్‌గానూ, నిర్మాతగానూ గుర్తింపు సాధించుకున్నారు. ఇక ఈ నటుడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (నా ‘డీఎన్‌ఏ’లోనే తప్పు జరిగింది.. అందుకే ఆమెతో బ్రేకప్ అయ్యింది)
ఇటీవల నాగ చైతన్యను కలిసిన అర్జున్ అతడికి ఓ కథను వినిపించారట. యాక్షన్ కథాంశంతో కూడిన ఆ కథ చైతూకు బాగా నచ్చిందట. ఫుల్ స్క్రిప్ట్‌తో రావాలని ఆయనకు సూచించారట. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్‌కి చైతూ ఓకే చెప్తే.. వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ షూటింగ్ క్లైమాక్స్‌లో ఉంది. ఈ మూవీ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యు అనే మూవీలో చైతూ నటించనున్నారు. (ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది: భూమా కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్)