07 April 2025

18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై నుంచి వెండితెరకు పరిచయమయ్యింది. 18 ఏళ్లకే తన తోటి నటుడిని పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లకే తల్లై రెండుసార్లు విడాకులు తీసుకుంది. 

కానీ ఇప్పుడు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత ఫెయిల్యూర్ అయ్యింది. 

ఆమె మరెవరో కాదు.. హిందీలో కసౌటి జిందగీ కె అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేత తివారి. ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసా.? 

పలు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉంది శ్వేత.

12 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్వేత. 18 ఏళ్ల వయసులోనే భోజ్పురి డైరెక్టర్ రాజ చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

అయితే కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి 2007లో రాజా చౌదరితో విడాకులు తీసుకుంది. 

కొన్నేళ్లపాటు ఒంటరిగా ఉన్న శ్వేతా తివారీ 2013లో అభినవ్ కోహ్లీని రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు. 

2019లో తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా వరుస వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది.