Dil Bechara: నా నవలకు జీవం పోశారు.. సంజనాకు హాలీవుడ్ రచయిత మెసేజ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా. సంజనా సంఘి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ జూలై 24న ఓటీటీలో విడుదల కాగా

Sushant Dil Bechara: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా. సంజనా సంఘి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ జూలై 24న ఓటీటీలో విడుదల కాగా.. పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక సుశాంత్ అభిమానులైతే ఈ మూవీని చూసి భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలోనూ సుశాంత్ మరణించే సన్నివేశం ఉండటం వారిని మరింత కదిలించింది. కాగా ఈ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. (యాక్షన్ కింగ్ దర్శకత్వంలో చైతూ..!)
కాగా దిల్ బేచారాను చూసిన ఆ నవల రచయిత జాన్ గ్రీక్, సంజనాకు మెసేజ్ పెట్టారు. ”హాయ్ సంజన. నేను ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ రచయితను. ఇవాళ దిల్ బేచారా సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేశా. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. కిజి పాత్రకు జీవం పోసినందుకు చాలా థ్యాంక్స్. కానీ మూవీ తరువాత నీ సహ నటుడి మరణం నిన్ను ఎంతగా బాధించిందో నేను అర్థం చేసుకోగలను. ఈ సినిమాకు జీం పోసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నా” అని కామెంట్ పెట్టారు.(నా ‘డీఎన్‌ఏ’లోనే తప్పు జరిగింది.. అందుకే ఆమెతో బ్రేకప్ అయ్యింది)
దీన్ని షేర్ చేసిన సంజనా.. ”మూడు నెలలుగా ఈ మెసేజ్‌ని నేను భద్రంగా దాచుకున్నా. జాన్ మీ మాటలు నన్ను ఎంత సంతోషింపజేశాయో చెప్పలేను. నా హృదయంలో ఉన్న బాధను ఇవి తీసేశాయి. మాకు ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ మూవీని విడుదలైన రోజే చూసినందుకు థ్యాంక్స్. కిజి పాత్ర నాకు ఎంతో ఇచ్చింది. నా నుంచి కొన్ని తీసుకెళ్లింది. ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను” అని సంజనా కామెంట్ పెట్టారు.(ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది: భూమా కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్)
https://www.instagram.com/p/CG7m2pUFu9n/?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts